ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించండి..

ABN, Publish Date - Jul 06 , 2024 | 03:08 AM

రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఆర్‌ఎ్‌సవీ, బీజేవైఎం ఆధ్వర్యంలో వేర్వేరుగా ఆందోళనలను నిర్వహించారు. శుక్రవారం నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్పీ) కార్యాలయం వద్దకు నిరుద్యోగులు తరలివచ్చారు.

  • బీఆర్‌ఎస్‌వీ, బీజేవైఎం ఆధ్వర్యంలో టీజీపీఎస్సీ కార్యాలయం ముందు ఆందోళన

  • ఆందోళనకారులను ఎక్కడికక్కడే అడ్డుకున్న పోలీసులు

  • శాంతియుత నిరసనలకూ అరెస్టులా?: కేటీఆర్‌

గోషామహల్‌/మౌలాలి/హైదరాబాద్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఆర్‌ఎ్‌సవీ, బీజేవైఎం ఆధ్వర్యంలో వేర్వేరుగా ఆందోళనలను నిర్వహించారు. శుక్రవారం నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్పీ) కార్యాలయం వద్దకు నిరుద్యోగులు తరలివచ్చారు. కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. అంతకుముందు టీజీపీఎ్‌ససీ కార్యాలయం వద్దకు రాకుండా నిరుద్యోగులను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. గోషామహల్‌ పోలీసు స్టేషన్‌ ఆవరణలో విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య గౌరవాధ్యక్షుడు రాజారాం యాదవ్‌ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు నిరుద్యోగులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డి.. ఇప్పుడు నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.


ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునేంత వరకు నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా గ్రూపు-2లో 2 వేలు, గ్రూపు-3లో 3 వేల పోస్టులను అదనంగా కలపాలని, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం బీఆర్‌ఎ్‌సవీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. గ్రూప్‌ 1 మెయిన్స్‌కు 1:100 చొప్పున అభ్యర్థులకు అవకాశం కల్పించాలని, జాబ్‌ క్యాలెండర్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, బీజేవైఎం ఆధ్వర్యంలో నిరుద్యోగుల ఆందోళనకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన కలెక్టరేట్ల ముట్టడిని పోలీసులు అడ్డుకోవడం సిగ్గుచేటని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి రంగుల శంకర్‌ అన్నారు.


రేవంత్‌కు నిరుద్యోగులంటే గౌరవం లేదు: బీఆర్‌ఎస్‌

టీజీపీఎస్సీ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపే ప్రయత్నం చేసిన నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడం ఏమిటని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. నిరుద్యోగుల పట్ల పోలీసులు, ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజాపాలన పేరును పదేపదే చెబుతున్న కాంగ్రెస్‌ సర్కార్‌ యువకులు, విద్యార్థులకు నిరసన తెలిపేఅవకాశం కూడా ఇవ్వకుండా నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నిరుద్యోగులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టులు చేసి నిర్బంధించడం హేయమైనచర్య అని మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు.


ఒకవైపు ప్రజాపాలన అంటూనే రేవంత్‌ సర్కారు నిరుద్యోగుల గొంతులను, వారి హక్కులను అణగదొక్కేలా కుట్రలకు పాల్పడుతోందని ఎక్స్‌ వేదికగా ఆయన ఆరోపించారు. మరోవైపు.. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపాలని, వాటికి రావాల్సిన నిధులను విడుదల చేయాలని సీఎం రేవంత్‌ని మాజీ మంత్రి హరీశ్‌ కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు.

Updated Date - Jul 06 , 2024 | 03:08 AM

Advertising
Advertising