ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Medaram Jatara: కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల ఆగ్రహం

ABN, Publish Date - Feb 22 , 2024 | 04:23 PM

Telangana: మేడారం జాతరను జాతీయ హోదా పండుగగా గుర్తించలేమంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఏబీఎన్‌ -ఆంధ్రజ్యోతితో బీఆర్‌ఎస్ నేత సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ... బీజేపీకి గిరిజనులపై ప్రేమలేదన్నారు. బీజేపీ కపటప్రేమ బయటపడిందని మండిపడ్డారు.

మేడారం, ఫిబ్రవరి 22: మేడారం జాతరను జాతీయ హోదా పండుగగా గుర్తించలేమంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నాయకులు( BRS, Congress Leaders) ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఏబీఎన్‌ -ఆంధ్రజ్యోతితో (ABN-Andhrajyothy) బీఆర్‌ఎస్ నేత సత్యవతి రాథోడ్ (BRS Leader Satyavati Rathod) మాట్లాడుతూ... బీజేపీకి గిరిజనులపై ప్రేమలేదన్నారు. బీజేపీ కపట ప్రేమ బయటపడిందని మండిపడ్డారు. మేడారంపై బీజేపీ వైఖరి దుర్మార్గమన్నారు. కిషన్ రెడ్డి మూర్ఖంగా మాట్లాడారని... బీజేపీది ధ్వంద వైఖరి అంటూ విరుచుకుపడ్డారు.

మహబూబాబాద్ ఎంపీ కవిత మాట్లాడుతూ.. మేడారానికి జాతీయ హోదా ఇవ్వాలని పార్లమెంటులో కొట్లాడినమని తెలిపారు. జాతీయ హోదా ఇస్తే ప్రపంచ గుర్తింపు వస్తుందన్నారు. అమ్మవార్లకు గౌరవం దక్కాలంటే జాతీయ హోదా ఇవ్వాల్సిందే అని పట్టుబడ్డారు.

కాంగ్రెస్ నేత అశోక్ మాట్లాడుతూ... మేడారం జాతరపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితమని మండిపడ్డారు. జాతీయ హెదా అనేది ఇక్కడి ప్రజల చిరకాల డిమాండ్ అన్నారు. ఆదివాసీల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 22 , 2024 | 04:25 PM

Advertising
Advertising