ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mulugu Maoist Encounter:ములుగు ఎన్‌కౌంటర్‌పై పలు అనుమానాలు.. పౌర హక్కుల సంఘం సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Dec 01 , 2024 | 09:04 PM

తెలంగాణలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఏటూరు నాగారం మండలం ఏజెన్సీ అడవుల్లో ఇవాళ(ఆదివారం) ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోలు మృతిచెందారు. చల్పాక అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి.

ములుగు: తెలంగాణలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఏటూరు నాగారం మండలం ఏజెన్సీ అడవుల్లో ఇవాళ(ఆదివారం) ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోలు మృతిచెందారు. చల్పాక అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో ఇల్లందు- నర్సంపేట ఏరియా కార్యదర్శి భద్రు సహా కీలక నేతలు మృతిచెందారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు ఏకే-47 రైఫిల్స్‌తోపాటు మరికొన్ని పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.


పోలీసులపై పౌరహక్కుల సంఘం ఆగ్రహం..

చెల్పాక ఎన్‌కౌంటర్‌పై పోలీసులు, రేవంత్ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర పౌరహక్కుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చెల్పాక ఎన్‌కౌంటర్ బూటకమని ఆరోపించింది. కోవర్టుల ద్వారా అన్నంలో విషం కలిపి సృహకోల్పోయిన తర్వాత పోలీసులు ఎన్ కౌంటర్ చేశారని అన్నారు. తలపై కాల్చిన గాయాలు తప్పితే ఎక్కడా గాయాలు లేవు అని అన్నారు. నిపుణులైన వైద్య బృందంతో పోస్టు మార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన 12నెలల్లో 16మంది మావోయిస్టులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ కౌంటర్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది.


ములుగు ఎస్పీ శబరిష్ కీలక వ్యాఖ్యలు ..

ఎన్ కౌంటర్‌పై ములుగు ఎస్పీ శబరిష్ కీలక వ్యాఖ్యలు చేశారు. వారం క్రితం వాజేడులో ఇద్దరు అమాయకులను మావోయిస్టులు చంపారని అన్నారు. ఇలాంటి ఘటనలు అరికట్టడానికి జిల్లా వ్యాప్తంగా పెట్రోలింగ్ పెంచామని చెప్పారు. ఈరోజు ఉదయం 6 :20 గంటలకు పెట్రోలింగ్ టీమ్‌కు 10 నుంచి 15 మంది మావోయిస్టులు తారసపడ్డారని తెలిపారు. పోలీసులను చూసి కాల్పులు జరిపారన్నారు. లొంగిపోవాలని పలుసార్లు హెచ్చరించినా మావోయిస్టులు కాల్పులు ఆపలేదని చెప్పారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపారు. కాల్పుల తర్వాత సెర్చ్ చేయగా ఏడుగురు చనిపోయినట్లు గుర్తించామని అన్నారు. మరికొందరు తప్పించుకున్నారన్నారు. వారికోసం గాలింపు కొనసాగుతోందని చెప్పారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని ములుగు ఎస్పీ శబరిష్ కీ సూచించారు.


మృతులు వీరే..

ఎదురు కాల్పుల్లో మృతిచెందిన ఏడుగులు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు ట్రాక్టర్లలో ఏటూరు నాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి మృతదేహాలకు మరికాసేపట్లో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మృతిచెందిన మావోయిస్టుల వివరాలను పోలీసులు వెల్లడించారు. టీఎస్‌సీఎం ఇల్లందు-నర్సంపేట సెక్రటరీ కుర్సం మంగు భద్రు అలియాస్ పాపన్న, ఏటూరునాగారం- మహదేవ్‌పూర్ డీవీసీఎం కార్యదర్శి ఈగోలపు మల్లయ్య అలియాస్ మధు, ఏసీఎం ముస్సాకి దేవల్ అలియాస్ కరుణాకర్, ఏసీఎం ముస్సాకి జమున, పార్టీ సభ్యులు జైసింగ్, కిషోర్, కామేశ్‌లు పోలీసులు వెల్లడించారు. అయితే ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అంటూ ప్రజాసంఘాల నేతలు మండిపడుతున్నారు.


నవంబర్ 22న ఇద్దరిని హతమార్చిన మావోలు..

ములుగు జిల్లా వాజేడులో మావోయిస్టులు నవంబర్ 22న ఇద్దరిని కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. పోలీసులకు ఇన్‌ఫార్మర్లుగా పని చేస్తున్నారని, ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో హత్య చేసినట్లు లేఖ విడుదల చేశారు. మృతులను ఉయిక రమేశ్‌, ఉయిక అర్జున్‌గా పోలీసులు గుర్తించారు. కాగా, రమేశ్‌ పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం చేస్తున్నారు. వీరిని హతమార్చడంతోనే భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టి ఏడుగురు మావోయిస్టులను హతమార్చినట్లు తెలుస్తోంది.

కాగా, మావోయిస్టులపై గత కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ మేరకు నవంబర్ 22న చత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో సైతం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఆ ఎదురుకాల్పుల్లో 10 మంది మావోలను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

Updated Date - Dec 01 , 2024 | 09:13 PM