ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Ponguleti: కబ్జా చేసిన వారిని వదిలిపెట్టం.. మంత్రి పొంగులేటి మాస్ వార్నింగ్

ABN, Publish Date - Nov 03 , 2024 | 07:01 PM

భద్రకాళి అమ్మవారిని ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మాడ వీధులను త్వరితగతిన పూర్తి చేస్తామని మాటిచ్చారు. భద్రకాళి జలాశయాన్ని తాగునీటి జలయశంగా మారుస్తామని హామీ ఇచ్చారు. భద్రకాళి చెరువు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వరంగల్: వరంగల్‌ను తెలంగాణకు రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దశాబ్దాల కాలంగా సమస్యల్లో ఉన్న మామునూర్ ఎయిర్ పోర్ట్‌కు అవాంతరాలు తొలగిపోయాయని చెప్పారు. ఇవాళ(ఆదివారం) వరంగల్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. మాడ వీధులను త్వరితగతిన పూర్తి చేస్తామని మాటిచ్చారు. భద్రకాళి జలాశయాన్ని తాగునీటి జలాశయంగా మారుస్తామని హామీ ఇచ్చారు. భద్రకాళి చెరువును కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ చెరువుపై సర్వే చేయించి నిర్మాణాలను తొలగిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.


సంక్రాంతి తర్వాత సన్న బియ్యం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట: సన్నబియ్యంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఈసారి ధాన్యం ఎక్కువగా పండిందని తెలిపారు. 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు పండించారని అన్నారు. సంక్రాంతి తర్వాత రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఇవాళ(ఆదివారం) సూర్యాపేటలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ... భారతదేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను తమ ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఈ స్కూల్‌లో 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు క్లాసులు జరుగుతాయని ప్రకటించారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇక్కడి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సభ్యులు కారు.. వీరంతా తమ కుటుంబ సభ్యులు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.


గడ్డిపల్లికి స్కూల్ మంజూరు కావడం చాలా సంతోషంగా ఉంది: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇంటిగ్రేటెడ్ స్కూల్‌లో 2000మంది విద్యార్థులు చదుకోవచ్చని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. అన్ని కులాలవారు ఈ స్కూల్‌లో చదుకోవచ్చని చెప్పారు. గడ్డిపల్లికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ స్కూల్ శంకుస్థాపనకు రావడం తనకు చాలా సంతోషంగా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

TG Politics : రైతులను రోడ్డున పడేసిన రేవంత్ సర్కార్

TG Politics: ‘దౌర్భాగ్య స్థితిలో రేవంత్ సర్కార్’

Minister Jupally: అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత గత పాలకులది..

For Telangana News And Telugu News

Updated Date - Nov 03 , 2024 | 07:12 PM