ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Crime News: మహిళపై అత్యాచారం... రేపిస్టును ఎన్‌కౌంటర్ చేయాలంటూ డిమాండ్..

ABN, Publish Date - Sep 15 , 2024 | 04:09 PM

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో వరస అత్యాచారాలు చేస్తూ శివకుమార్ అనే కామాంధుడు హడలెత్తిస్తున్నాడు. శనివారం రాత్రి ఓ వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో గ్రామస్థులంతా వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట భైఠాయించి అతణ్ని కఠినంగా శిక్షించాలంటూ నిరసన తెలుపుతున్నారు.

ములుగు: దేశంలో ఏ మూలన చూసినా ప్రతిరోజూ మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన శిక్షలు వేస్తున్నా నేరస్థుల్లో మాత్రం భయం పుట్టడం లేదు. ఒక ప్రాంతంలో అత్యాచారం జరిగిందంటూ పెద్దఎత్తున నిరసనలు జరిగిన మరుసటి రోజే మరో అత్యాచారం గురించి వినాల్సిన దుస్థితి నెలకొంది. కామాంధులకు కఠిన శిక్షలు పడుతున్నా చివరికి ఎన్‌కౌంటర్లు జరిగిన ఘటనలు కళ్లెదుటే కనిపిస్తున్నా నిందితుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు.


తాజాగా అలాంటి ఘటనే ఒకటి ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని ఓ గ్రామంలో వరస అత్యాచారాలు చేస్తూ హడలెత్తిస్తున్న కామాంధుడు శివకుమార్.. గత రాత్రీ(శనివారం) మరో మహిళపై దారుణానికి ఒడిగట్టాడు. వృద్ధురాలని కూడా చూడకుండా ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై కన్నేశాడు. ఎవరూ లేని సమయం చూసి ఇంట్లో చొరబడి అత్యాచారం చేశాడు. గదిలోనే బంధించి రాత్రి మెుత్తం అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఉదయం ఘటన గురించి తెలుసుకున్న గ్రామస్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.


గ్రామస్థులంతా వెంకటాపూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. నిందితుడు శివకుమార్‌ను కఠినంగా శిక్షించాలని స్టేషన్ ఎదుట బైఠాయించి డిమాండ్ చేశారు. శివకుమార్ గతంలోనూ ఆరుగురు మహిళలపై అత్యాచారం చేశాడని గ్రామస్థులు ఆరోపించారు. ఇలాంటి కామాంధుణ్ని వదలకూడదని, వదిలితే మరిన్ని దారుణాలకు పాల్పడతాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతణ్ని ఎన్‌కౌంటర్ చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట భైఠాయించి డిమాండ్ చేస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

TPCC: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరణ..

CM Revanth: సీఎం రేవంత్ ఇంటి వద్ద బ్యాగ్ కలకలం

Serilingampally MLA: అరెకపూడి గాంధీ నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు

BRSV: మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బీఆర్‌ఎస్‌వీ యత్నం

Updated Date - Sep 15 , 2024 | 04:53 PM

Advertising
Advertising