Share News

TG News: తెలంగాణను వణికిస్తున్న పులులు

ABN , Publish Date - Dec 27 , 2024 | 04:41 PM

Telangana: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం శివారులో పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. మిర్చి పంట పొలంలో పులి అడుగులు గుర్తించిన రైతులు, కూలీలు తమ పనులను ఆపేసి భయంతో ఇళ్లకు పరుగులు తీశారు. వెంటనే గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

TG News: తెలంగాణను వణికిస్తున్న పులులు
Tiger Spotted Roaming in Rudragudem V

హైదరాబాద్, డిసెంబర్ 27: తెలంగాణ రాష్ట్రాన్ని పులులు వణికిస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడి నుంచి పులులు దాడి చేస్తాయో తెలియక ప్రజలు భయంతో అల్లాడిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇంటి నుంచి కాలు బయటకు పెట్టాలంటేనే వెనక్కి జంకుతున్నారు. తాజాగా వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం శివారులో పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. మిర్చి పంట పొలంలో పులి అడుగులు గుర్తించిన రైతులు, కూలీలు తమ పనులను ఆపేసి భయంతో ఇళ్లకు పరుగులు తీశారు. వెంటనే గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పులి సంచారంపై అటవీ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ వారు స్పందించడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. తక్షణమే ఫారెస్ట్ అధికారులు గ్రామానికి వచ్చి పులి పాదముద్రలు సేకరించి.. పులినా కాదా నిర్ధారించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


రుద్రం గూడెం శివారులో ఈరోజు ఉదయం పులి కదలికలను రైతులు గుర్తించారు. మిర్చి తోటలో పులి పాదముద్రలను చూసిన వ్యవసాయ కూలీలు భయంతో అక్కడ నుంచి బయటకు పరుగులు తీశారు. పులి గుర్తులతో పాటు పులి గాండ్రింపు శబ్దాలు కూడా విన్నామని స్థానిక రైతులు, కూలీలు చెబుతున్నారు. పులి సంచారంతో మిర్చిని ఏరేందుకు వచ్చిన రైతులంతా పరుగులు పెట్టారు. గత రెండు వారాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పులి సంచారం కొనసాగుతోంది. గోదావరిని దాటి వచ్చి తడ్వాయి మండలం వెంకటాపురంలో పులి సంచారం కలకలం రేపుతోంది. పులిని పట్టుకునేందుకు ట్రాక్ చేస్తున్నామని అటవీ శాఖ అధికారులు చెబుతున్నపటికీ పులి వారికి చిక్కని పరిస్థితి.

Viral Video: నిద్ర లేచీ లేవగానే టీ కావాలని అరిచాడు.. అటువైపు నుంచి వచ్చిన రియాక్షన్‌తో ఖంగుతిన్నాడు..


అయితే ఇక్కడ సంచరించిన పులి రుద్రగూడెంలో సంచరించిన పులి ఒక్కటేనా అనేది తెలియాల్సి ఉంది. అటవీ అధికారులకు రైతులు సమాచారం ఇవ్వగా మరికాసేపట్లో వారు అక్కడకు చేరుకునే అవకాశం ఉంది. అయితే ఆ పాదముద్రలు పులివా లేక మరేదైనా జంతువుదా అనే విషయాన్ని అటవీ శాఖ అధికారులు తేల్చాల్సి ఉంది. రుద్రగూడెం గ్రామం అటవీ ప్రాంతానికి దగ్గరైనప్పటికీ అన్నీ కూడా మిర్చి తోటలు, పత్తి వ్యవసాయం చేసే పంట పొలాలు కాబట్టి ఈ ప్రాంతానికి పులి వచ్చే సూచనలు తక్కువగా ఉంటుంది.. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులు నిర్ధారణ చేశాకే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే పెద్ద పెద్ద అడుగులు, పులి గాండ్రిపులు వినిపిస్తున్నాయని రైతులు తీవ్ర భయాందళన వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

ఆర్థిక మార్గదర్శి అస్తమయం

అమరావతిలో అండర్‌గ్రౌండ్‌ దందా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 27 , 2024 | 04:46 PM