Share News

BRS: బీఆర్ఎస్‌కు షాక్.. ఆ సభపై లేని క్లారిటీ

ABN , Publish Date - Apr 06 , 2025 | 01:59 PM

BRS Warangal Meeting: బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ హై కమాండ్ ప్లాన్ చేసింది. ఇందుకోసం గులాబీ బాస్ కేసీఆర్ వరుసగా నేతలతో సమావేశం అవుతున్నారు. ఈ సభ కోసం వరంగల్ పోలీసుల నుంచి ఇంకా అనుమతి రాకపోవడంతో సందిగ్ధం నెలకొంది.

BRS: బీఆర్ఎస్‌కు షాక్.. ఆ సభపై లేని క్లారిటీ
BRS Warangal Meeting

వరంగల్: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సిటీపోలీస్ యాక్ట్ అడ్డంకిగా మారింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లుగా వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ప్రకటించారు. నేటి నుంచి 30 రోజులపాటు అమల్లో సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉండనుంది. వరంగల్ కమిషనరేట్ పరిధిలో మీటింగులు, ఊరేగింపులను నిషేధిస్తూ వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.


ఈనెల 27వ తేదీన కమిషనరేట్ పరిధిలోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ హై కమాండ్ ప్రకటించింది. సభ అనుమతి కోసం పోలీస్ శాఖను పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ లిఖిత పూర్వక అనుమతి కోరారు. అనుమతిపై ఇప్పటి వరకు పోలీస్ కమిషనరేట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. సిటీ పోలీస్ యాక్ట్ అమలుతో బీఆర్ఎస్ రజతోత్సవ సభ చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే సభా ఏర్పాట్లలో బీఆర్ఎస్ నేతలు నిమగ్నమయ్యారు. ఈ విషయంలో కోర్టును బీఆర్ఎస్ నేతలు ఆశ్రయించనున్నారు. ఇప్పటికే ఈ సభ కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. గత వారం రోజులుగా సిద్దిపేట ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌‌లో ఆయా ఉమ్మడి జిల్లాల నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Bhadradri శ్రీరామనవమి వేడుకలు.. సీతారాముల కల్యాణం..

Bandi Sanjay: మాది దేశ భక్తి పార్టీ, ఎంఐఎం దేశ ద్రోహ పార్టీ

PM Kisan Scheme: 20వ విడత డబ్బుల కోసం రైతులు ఎదురుచూపు..

Read Latest Telangana News and Telugu News

Updated Date - Apr 06 , 2025 | 02:06 PM