ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YS Sharmila: తెలంగాణ ప్రభుత్వంపై షర్మిల ప్రశంసలు

ABN, Publish Date - Jul 19 , 2024 | 03:26 PM

తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) రాష్ట్ర వ్యాప్తంగా రూ. లక్ష వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేసిన విషయం తెలిసిందే. జూలై 18వ తేదీన సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించారు.

YS Sharmila

అమరావతి: తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) రాష్ట్ర వ్యాప్తంగా రూ. లక్ష వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేసిన విషయం తెలిసిందే. జూలై 18వ తేదీన సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11 లక్షల మంది రైతులకు రుణమాఫీ (Runa maffi) జరిగింది. అయితే ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి (YS Sharmila Reddy) ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు ట్విట్టర్(X) వేదికగా ట్విట్ చేశారు.


ALSO Read: Minister Ponguleti: కేసీఆర్ సర్కార్‌లో ఆర్థిక విధ్వంసం

కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధత చూపింది

‘‘దేశవ్యాప్తంగా 15 ఏళ్ల క్రితం ఒకే దఫాలో రుణమాఫీ చేసి అన్నదాత పట్ల ప్రేమ, వ్యవసాయం పట్ల నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధత చూపింది. మళ్లీ నిన్న తెలంగాణలోని రేవంత్ రెడ్డి సారథ్యంలో, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆలోచన, ఆదర్శాలకు అనుగుణంగా, ఇంకెప్పుడు అని వెక్కిరించే నోళ్లు మూస్తూ, కాంగ్రెస్ సర్కారు అందించిన రైతు రుణమాఫీ వరం చరిత్ర గర్వించే రోజు. రైతు కళ్లల్లో ఆనందం తిరిగి తీసుకువచ్చే క్షణం. ఈ హామీ రాహుల్ గాంధీ ఎన్నికల వేళ చేసిన వాగ్దానం సాకారమైన రోజు’’ అని తెలంగాణ సర్కారుకు మనస్ఫూర్తిగా షర్మిల అభినందనలు తెలిపారు.


ALSO Read: KTR: చారాణ కోడికి..! బారాణ మసాలా అంటూ రేవంత్‌కి కౌంటర్

అప్పులో ఏపీ తొలిస్థానంలో..

‘‘ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కారును డిమాండ్ చేస్తున్నాం. రైతుల తలసరి అప్పులో, దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో రైతు రుణమాఫీ ఎందుకు చేయరు. సుమారు రూ. 2,45,554 రుణం ప్రతి రాష్ట్ర రైతు నెత్తి మీద కత్తిలా వేలాడుతోంది. గడచినా దశాబ్దంలో అటు కరువు, తుఫానులు, ఇటు పూర్తికాని ప్రాజెక్టులు, సర్కారుల నిర్లక్ష్యం, వెరసి రాష్ట్ర వ్యవసాయం సర్వనాశనం అయిపోయింది’’ అని షర్మిలపేర్కొన్నారు.


ALSO Read: Group-2 Exams: గ్రూపు-2 పరీక్షలు వాయిదా!?

కూటమి సర్కార్ రైతులకు చేయూతనివ్వాలి..

‘‘మరి డబుల్ ఇంజిన్ సర్కారు నడుపుతున్న మీరు, కేంద్ర సాయంతో ఎందుకు రుణమాఫీ చేయకూడదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే, రూ.2 లక్షల రుణమాఫీ, ఇచ్చిన మాట ప్రకారం కచ్చితంగా చేసి ఉండేదని గర్వంగా చెప్పగలం. కూటమి సర్కారును అడుగుతున్నాం, రైతు రుణమాఫీ చేయండి, అన్ని విధాలుగా చితికిపోయిన ఆంధ్ర ప్రదేశ్ రైతులకు చేయూతనివ్వండి. ఇది ఛాయిస్ కాకూడదు, బాధ్యతగా అనుకోవాలి’’ అని షర్మిల తెలిపారు.


కేంద్రంలో కాంగ్రెస్ వస్తే..

‘‘మరి డబుల్ ఇంజిన్ సర్కారు నడుపుతున్న మీరు, కేంద్ర సాయంతో ఎందుకు రుణమాఫీ చేయకూడదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే, రూ.2 లక్షల రుణమాఫీ, ఇచ్చిన మాట ప్రకారం కచ్చితంగా చేసి ఉండేదని గర్వంగా చెప్పగలం. కూటమి సర్కారును అడుగుతున్నాం, రైతు రుణమాఫీ చేయండి, అన్ని విధాలుగా చితికిపోయిన ఆంధ్ర ప్రదేశ్ రైతులకు చేయూతనివ్వండి. ఇది ఛాయిస్ కాకూడదు, బాధ్యతగా అనుకోవాలి’’ అని షర్మిల తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

Crop Loan Waiver: రైతులకు బిగ్ అలర్ట్.. ఈ తప్పు అస్సలు చేయకండి..

IMD: ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. కమ్ముకొస్తున్న మబ్బులు

Raj Tarun-Malvi Malhotra: హీరో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా మెసేజ్ చాట్స్ లీక్.. లవ్ ప్రపోజ్ చేసిన..

Read More Telangana News and Telugu News

Updated Date - Jul 19 , 2024 | 03:36 PM

Advertising
Advertising
<