KCR: కేసీఆర్‌కు బిగ్ షాక్.. మరోసారి నోటీసులు
ABN, Publish Date - Jul 11 , 2024 | 06:40 PM
తెలంగాణలో జరిగిన విద్యుత్తు ఒప్పందాలపై జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి (Justice L. Narasimha Reddy) నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్ నియమించిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్: తెలంగాణలో జరిగిన విద్యుత్తు ఒప్పందాలపై జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి (Justice L. Narasimha Reddy) నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్ నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్‌కు (KCR) రెండోసార్లు నోటీసులు పంపించింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్ పాత్రపై కమిషన్ వివరణ కోరింది. తనను విచారణకు పిలవకూడదంటూ కేసీఆర్ తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు. అయితే గులాబీ బాస్‌కు న్యాయస్థానంలో చుక్కెదురైంది. కేసీఆర్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
కమిషన్‌కు కేసీఆర్‌ను విచారించే అధికారం ఉందని తెలంగాణ హైకోర్టు తేల్చిచెప్పింది. కోర్టు షాక్ ఇవ్వడంతో కేసీఆర్ సైలెంట్ అయిపోయారు. న్యాయస్థానం నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో కేసీఆర్‌కు కమిషన్ మళ్లీ నోటీసులు పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నోటీసులు వస్తే గులాబీ బాస్ వైఖరి ఎలా ఉంటుందనేది పెద్ద ప్రశ్నగా మారింది. నోటీసులు వస్తే కమిషన్ ముందు కేసీఆర్ హాజరై సమాధానం చెబుతారా..? లేదా సుప్రీంకోర్టుకు వెళ్తారా..? అన్నది చూడాలి.
హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఎల్. నరసింహారెడ్డి కమిషన్ విచారణలో వేగం పెంచింది. ఇప్పటికే కేసీఆర్‌కు రెండుసార్లు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మూడోసారి నోటీసులు ఇచ్చి కేసీఆర్‌ను వివరాలు కోరే అవకాశం ఉంది. ఈరోజు లేదా రేపు కేసీఆర్‌కు కమిషన్ నోటీసులు పంపించే అవకాశాలున్నాయి. రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసిన అంశంపై కూడా విచారించనున్నది.
అలాగే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి ఇచ్చిన కాంట్రాక్టుల విషయంలో జరిగిన అవకతకలపై కూడా కమిషన్ విచారించనున్నట్లు తెలుస్తోంది. విచారణ పూర్తయిన తర్వాత ఇచ్చే నిజనిర్దారణ నివేదిక ఇవ్వాలని జస్టిస్ ఎల్ నర్సింహరెడ్డి కమిటీని రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే కమిషన్ పలువురిని విచారించింది. కేసీఆర్ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాల నుంచి వివరాలు సేకరించింది.
Updated Date - Jul 11 , 2024 | 10:25 PM