Telangana: అమ్మవారి సేవలో సీఎం రేవంత్

ABN, Publish Date - Dec 25 , 2024 | 01:02 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా ఏడుపాయల వన దుర్గా దేవి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంతో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు పలువురు మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు వన దుర్గా దేవిని దర్శించుకున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. మొదట ఆయన ఏడుపాయల వన దుర్గా దేవి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్థానిక ప్రజాప్రతినిధులు వన దుర్గాదేవిని దర్శిం చుకున్నారు. అనంతరం మెదక్ చర్చికి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. క్రిస్మస్ సందర్భంగా మెదక్ చర్చిలో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం పాల్గొంటారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here

Updated at - Dec 25 , 2024 | 01:15 PM