జనసేన సభలో కన్నీళ్లు పెట్టుకున్న బాలినేని..

ABN, Publish Date - Mar 14 , 2025 | 08:34 PM

పదవి వచ్చినా, రాకపోయినా ప్రాణం ఉన్నంత వరకూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తోనే ఉంటానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. రాజకీయాల కోసం తన తండ్రి ఇచ్చిన ఆస్తిలో సగానికి పైగానే అమ్ముకున్నానని బాలినేని చెప్పారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

కాకినాడ: పదవి వచ్చినా, రాకపోయినా ప్రాణం ఉన్నంత వరకూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తోనే ఉంటానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. రాజకీయాల కోసం తన తండ్రి ఇచ్చిన ఆస్తిలో సగానికి పైగానే అమ్ముకున్నానని బాలినేని చెప్పారు. అలాగే తన ఆస్తిని, తన వియ్యంకుడి ఆస్తినీ జగన్ కాజేశారని కన్నీటి పర్యంతం అయ్యారు. పిఠాపురం చిత్రాడలో జరుగుతున్న జనసేన 12వ అవిర్భావ సభలో మాజీ మంత్రి బాలినేని మాట్లాడారు. " సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇళ్లల్లో ఆడవాళ్లను పోసాని కృష్ణమురళీ దూషించారు. అలాంటి వారిని జగన్ మోహన్ రెడ్డి ప్రోత్సహించారు. జగన్‪కు ఆ తిట్లు, నీతిమాలిన మాటలు కనిపించలేదా?. చంద్రబాబు, పవన్‍కు బాధ కలగదా?. వైసీపీలో చాలా మంది వెధవలు ఉన్నప్పటికీ.. బాలినేని వంటి మంచివారూ ఉన్నారని గతంలో పవన్ చెప్పారు. అప్పుడే జనసేనలోకి రావాల్సింది. ఆలస్యమైంది. నాది ఒక్కటే విజ్ఞప్తి. తప్పు చేసిన చిన్న కార్యకర్తలను అరెస్టు చేయిస్తున్నారు. స్కీముల పేరుతో స్కాములు చేసి కోట్లు దోచుకున్న వారు దర్జాగా తిరుగుతున్నారు. అలాంటి అవినీతిపరులను గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని" బాలినేని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Pithapuram: ప్రారంభమైన జనసేన 12వ ఆవిర్భావ సభ.. జగన్‌పై సెటైర్లు వేసిన నాగబాబు..

Balineni Srinivasa Reddy: జగన్.. నీలాగా కాదు.. స్వశక్తితో ఎదిగిన నేత పవన్: బాలినేని..

Updated at - Mar 14 , 2025 | 08:36 PM