Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో పెద్ద గొడవ.. ఇదిగో వీడియో..
ABN, Publish Date - Dec 20 , 2024 | 03:29 PM
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. భూ భారతి బిల్లుపై చర్చను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు.
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. భూ భారతి బిల్లుపై చర్చను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. ఫార్ములా ఈ-రేస్ అంశంపై చర్చ పెట్టాలని బీఆర్ఎస్ సభ్యుడు డిమాండ్ చేశారు. ప్లకార్డులతో స్పీకర్ పోడియం వైపు వెళ్లారు. అయితే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో మార్షల్స్‌కి, బీఆర్ఎస్ సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాట జరిగింది. ఒక సందర్భంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. అసెంబ్లీ స్పీకర్‌పై కాగితాలు విసిరేశారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ తీవ్ర గందరగోళంగా మారింది.
Updated Date - Dec 20 , 2024 | 03:29 PM