Share News

Jaganmohan Reddy: జగన్‌ ఇక జీవితంలో సీఎం కాలేడు

ABN , Publish Date - Mar 15 , 2025 | 04:38 AM

చివరకు నా ఆస్తితోపాటు నా వియ్యంకుడి ఆస్తిని కూడా కొంత కాజేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు చిన్నచిన్న వైసీపీ కార్యకర్తలనే జైల్లో వేసింది. అదే నేనైతే కోట్లాది రూపాయలు కాజేసిన వారిని ఒక్క రోజులోనే జైల్లో వేసేవాడిని. నా ప్రాణం ఉన్నంతవరకు పవన్‌ కల్యాణ్‌తోనే ఉంటా. పవన్‌తో కలిసి ఒక సినిమా తీయాలనుకుంటున్నా.

Jaganmohan Reddy: జగన్‌ ఇక జీవితంలో సీఎం కాలేడు

జగన్మోహన్‌రెడ్డి ఇక జీవితంలో ఎప్పటికీ సీఎం కాలేడు. నమ్ముకున్నవారిని కూడా ఆయన మోసం చేస్తారు. చివరకు నా ఆస్తితోపాటు నా వియ్యంకుడి ఆస్తిని కూడా కొంత కాజేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు చిన్నచిన్న వైసీపీ కార్యకర్తలనే జైల్లో వేసింది. అదే నేనైతే కోట్లాది రూపాయలు కాజేసిన వారిని ఒక్క రోజులోనే జైల్లో వేసేవాడిని. నా ప్రాణం ఉన్నంతవరకు పవన్‌ కల్యాణ్‌తోనే ఉంటా. పవన్‌తో కలిసి ఒక సినిమా తీయాలనుకుంటున్నా. నాకు రాజశేఖరరెడ్డి రాజకీయ భిక్ష పెట్టారు. అందుకు జగన్‌ పార్టీ పెడితే మంత్రి పదవి వదులుకుని ఆయన వెంట నడిచాను. కానీ ఆయన నాకెంతో అన్యాయం చేశాడు. మంత్రి పదవి ఇచ్చి తీసేశాడు. అయినా నేను లెక్కపెట్టలేదు. వంశీని, పోసానిని అరెస్టు చేస్తే వాళ్లను పరామర్శించాడు. అధికారంలో ఉండగా రఘురామరాజును కొట్టించావు. చంద్రబాబు భార్యను తిట్టించావు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలలకు వాళ్లను లోపలేశారు. నేనైతే మొదటిరోజే లాఠీతో కొట్టించేవాడిని.

- మాజీ మంత్రి బాలినేని

పోరాటాలతో 11 ఆవిర్భావ సభలు నిర్వహించాం. వాటికి నాడు వైసీపీ ఎన్నో ఆటంకాలు కలిగించింది.

- ఎంఎ్‌సఎంఈ కార్పొరేషన్‌ చైర్మన్‌ టి.శివశంకర్‌

జగన్‌ అహంకారం వల్లే వైసీపీ సర్వనాశనం అయిపోయింది.

- జనసేన ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి

తెలంగాణలో పుట్టిన జనసేన ఏపీలో విజయం సాధించింది. తెలంగాణలో కూడా దృష్టి పెట్టాలి.

- పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి శంకర్‌


ఇవి కూడా చదవండి..

Pawan Kalyan: స్టేట్ అయినా.. సెంట్రల్ అయినా.. ఆయన క్రేజే వేరు..

Putin - Modi ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణపై పుతిన్ కీలక వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 15 , 2025 | 04:38 AM