BJP: ఎంఐఎం-కాంగ్రెస్‌ది ఫెవికాల్ బంధం
ABN , Publish Date - Mar 16 , 2025 | 04:27 AM
అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్, ఎంఐఎం మధ్య ఫెవికాల్ బంధం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్‌బాబు, సూర్యనారాయణ మాట్లాడారు.

మోదీతో రేవంత్ దోస్తీ.. మాతో కుస్తీ: బీజేపీ ఎమ్మెల్యేలు
అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్, ఎంఐఎం మధ్య ఫెవికాల్ బంధం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్‌బాబు, సూర్యనారాయణ మాట్లాడారు. తమ నియోజకవర్గాల్లోని సమస్యలపై సీఎం, మంత్రులను కలిసినా పట్టించుకోలేదని.. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ అడిగిన వెంటనే సీఎం స్పందించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రినా..? లేక ఎంఐఎంకా..? అని ప్రశ్నించారు.
ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం, వరంగల్ టెక్స్ టైల్ పార్కు, వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం నిధులిచ్చిందని ముఖ్యమంత్రి చెప్పారని.. రాష్ట్ర అభివృద్థికి కేంద్రం సహకరిస్తోందని ఆయన మాటల్లోనే స్పష్టమైందని పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రఽధానితో దోస్తీ చేస్తూ ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి తమతో కుస్తీ పడుతున్నారని అన్నారు. ఆర్టీసీకి రూ.5వేల కోట్ల బకాయిలు చెల్లించామని ప్రభుత్వం అబద్ధం చెబుతోందని, నెలవారీ జీతాల కోసం ఉద్యోగులు అడుక్కోవాల్సిన దుస్థితి ఉందని బీజేపీ ఎమ్మెల్యేలు వివరించారు.