HEALTH: ఆరోగ్యంపై ఆరా
ABN , Publish Date - Feb 28 , 2025 | 12:03 AM
ప్రజల ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు నాన కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎనసీడీ)3.0 సర్వేను ప్రభుత్వం గత నెల నుంచి చేపట్టింది. ఈ సందర్భంగా అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి.

- మెరుగైన సేవలే లక్ష్యం: డిప్యూటీ డీఎంహెచఓ
ధర్మవరం, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): ప్రజల ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు నాన కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎనసీడీ)3.0 సర్వేను ప్రభుత్వం గత నెల నుంచి చేపట్టింది. ఈ సందర్భంగా అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, బ్రైయినసో్ట్రక్, గుండెపోటు తదితర రోగాల బారిన ఎక్కువ మందిపడుతున్నారు. చాలా మంది వైద్యపరీక్షలు చేయించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తుండటం వల్ల ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. జిల్లాలో ఈ సర్వే శరవేగంగా సాగుతోంది.
క్యాన్సర్ స్ర్కీనింగ్
చాలా మంది మహిళలు క్యాన్సర్ బారినపడుతున్న నేపథ్యంలో 3.0 ఎనసీడీ సర్వేలో భాగంగా క్యాన్సర్ స్ర్కీనింగ్ పరీక్షలపై దృష్టిపెట్టారు. 30 ఏళ్లు దాటిన మహిళలకు క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయో, లేదో తెలుసుకుంటున్నారు. నోటి, గర్భాశయ, ఇలా వివిధ రకాల క్యాన్సర్ లక్షణాలు ఉంటే గుర్తించి వివరాలు వైద్యాధికారులకు తెలియజేస్తున్నారు. అనంతరం ప్రభుత్వాస్పత్రిలో నిపుణుల పర్యవేక్షణలో వ్యాధి నిర్ధారణ చేసి చికిత్సలు అందిస్తారు.
బాధితుల గుర్తింపుపై దృష్టి
సంక్రమిత, అసంక్రమిత రోగాల సర్వే ద్వారా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిపై అధ్యయనం చేసి అంచనా వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందు కోసం ఏఎనఎం, ఎంఎల్‌హెచసీ, వైద్యాధికారులు, ఆశా కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. రోజుకు 15 నుంచి 20 ఇళ్ల వరకు సర్వే చేస్తున్నారు. బీపీ పరీక్షా పరికరం, మధుమేహ వ్యాధిని గుర్తించడానికి గ్లూకోమీటరు, రక్తహీనతను గుర్తించేందుకు హిమోగ్లోబిన మీటరు, గర్భాశయ ముఖద్వారా పరీక్షలు చేయడానికి పరికరాలను అందజేశారు.
మెరుగైన సేవలే లక్ష్యం:
సెల్వియా సాల్మన,
డిప్యూటీ డీఎంహెచఓ, ధర్మవరం
సర్వే పకడ్బందీగా నిర్వహించి రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. గతంలో ఎనసీడీ 2.0 పేరుతో ఇంటింటా సర్వే నిర్వహించాం. ప్రస్తుతం ఎనపీడీ 3.0 సర్వే చేపడుతున్నాం. సిబ్బంది ఇంటింటికి వెళ్లి రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ పరీక్షలు చేయడంతోపాటు ఆహారపు అలవాట్లు తదితర వాటిపై వివరాలు సేకరిస్తున్నారు.