AWERNESS: చట్టంపై చైతన్యం పెరగాలి
ABN , Publish Date - Mar 14 , 2025 | 11:58 PM
వినియోగదారుల రక్షణ చట్టంపై ప్రజల్లో చైతన్యం రావాల్సిన ఉందని వినియోగదారుల కమిషన అధ్యక్షురాలు శ్రీలత అన్నారు. అప్పుడే చట్టం లక్ష్యం నెరవేరుతుందన్నారు.

అనంతపురం క్రైం, మార్చి14(ఆంధ్రజ్యోతి): వినియోగదారుల రక్షణ చట్టంపై ప్రజల్లో చైతన్యం రావాల్సిన ఉందని వినియోగదారుల కమిషన అధ్యక్షురాలు శ్రీలత అన్నారు. అప్పుడే చట్టం లక్ష్యం నెరవేరుతుందన్నారు. శనివారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె ప్రకటన విడుదల చేశారు. నాణ్యతలేని ఉత్పత్తులు, తప్పుడు ప్రకటనలు, అధిక ధరలు, సరైన సేవలు అందకపోవడం తదితరాల్లో పరిహారం కోసం వినియోగదారుల రక్షణ చట్టం-2019 అమలులో ఉందన్నారు. దీనిపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమన్నారు. ఉత్పత్తులు, సేవలతో నష్టపోతే పరిహారం పొందే హక్కు ఉందన్నారు. రూ.కోటిలోపు కేసులు జిల్లా కమిషన ఎదుట, రూ.కోటి-రూ.10కోట్ల పైబడిన కేసులు జాతీయ కమిషన ఎదుట దాఖలు చేయవచ్చన్నారు. వినియోగదారులు ఆనలైనలోనే ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. నాణ్యతలేని ఉత్పత్తులకు తయారీదారులు, విక్రయదారులు, సేవాదారులందరూ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రెండేళ్ల కాలపరిమితికి లోబడి కమిషన ఎదుట ఫిర్యాదులు దాఖలు చేయవచ్చని ఆమె వివరించారు.