Red Cross: నేత్రదానంపై అవగాహన అవసరం
ABN , Publish Date - Apr 13 , 2025 | 11:57 PM
నేత్రదానంపై ప్రతి ఒక్కరికీ కనీస అవగాహన అవసరమని రెడ్‌క్రాస్ చైర్‌పర్సన భారతి పేర్కొన్నారు. స్థానిక సుభాష్‌రోడ్డులోని శ్రీకృష్ణదేవరాయభవనలో ఆదివా రం ఇండియన రెడ్‌క్రాస్ సొసైటీ ఆఽధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన సదస్సు నిర్వహించారు.

అనంతపురం క్లాక్‌టవర్, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): నేత్రదానంపై ప్రతి ఒక్కరికీ కనీస అవగాహన అవసరమని రెడ్‌క్రాస్ చైర్‌పర్సన భారతి పేర్కొన్నారు. స్థానిక సుభాష్‌రోడ్డులోని శ్రీకృష్ణదేవరాయభవనలో ఆదివా రం ఇండియన రెడ్‌క్రాస్ సొసైటీ ఆఽధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ సొసైటీ చైర్‌పర్సన భారతి మాట్లాడుతూ... ప్రస్తుతం జిల్లాలో ఉన్న రెడ్‌క్రాస్ కార్నియా సేకరణ కేంద్రంతో పాటు నూతనంగా కార్నియా ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని కలెక్టర్, రెడ్‌క్రాస్ అధ్యక్షుడు వినోద్‌కుమార్ సూచించినట్లు తెలిపారు. స్వచ్చంధ సంస్థల సహకారంతో ఈ సదుపాయం త్వరలో ప్రారంభిస్తామన్నారు. ప్రజలు అపోహలు వీడి నేత్రదానంపై కనీస అవగాహనతో ముందుకు రావాలని కోరారు. నేత్రదా నం సమయంలో కేవలం కార్నియా పొర మాత్రమే తీసుకుంటార ని...దీంతో కంటిలో ఎలాంటి మార్పు కనిపించదని తెలిపారు. నేత్రదానం చేయాలనుకున్న వారు మరిన్ని వివరాలకు రెడ్‌క్రాస్‌కు సంబంధించిన సెల్ నంబర్లు 8332021919, 9666629797ను సంప్రదించాలని కోరారు. కంటి ప్రాసెసింగ్ కేంద్రం ప్రారం భించేందుకు అన్ని విధాలా సహకరి స్తామని స్వచ్చంధసంస్థల ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ వైస్‌చైర్మన లక్ష్మణ్‌ప్రసాద్, సభ్యులు తిరుపతినాయుడు, చంద్రకాంత నాయుడు, ఆలంబన జనార్దన, అప్పా సుధీర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....