OFFICE : సిబ్బంది కొరతతో ఇబ్బందులు
ABN , Publish Date - Jan 06 , 2025 | 12:08 AM
నియోజకవర్గం కేంద్రమైన శింగనమలలో తహసీ ల్దార్ కార్యాలయాన్ని సిబ్బంది కొరత పీడిస్తోంది. దీంతో ప్రజ సమస్యల పరిష్కారం జఠిలంగా మారిందని ప్రజలు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో కీలకమైన ఆర్‌ఐ లేక పోవడం తో సర్టిఫికెట్ల జారీలో అలస్యం అవుతున్నట్లు ప్రజల నుంచి ఆరోపణలు వినిసిస్తున్నాయి.
అవస్థలు పడుతున్న ప్రజలు, రైతులు
శింగనమల తహసీల్దార్ కార్యాలయంలో ఇలా...
శింగనమల, జనవరి 5(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గం కేంద్రమైన శింగనమలలో తహసీ ల్దార్ కార్యాలయాన్ని సిబ్బంది కొరత పీడిస్తోంది. దీంతో ప్రజ సమస్యల పరిష్కారం జఠిలంగా మారిందని ప్రజలు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో కీలకమైన ఆర్‌ఐ లేక పోవడం తో సర్టిఫికెట్ల జారీలో అలస్యం అవుతున్నట్లు ప్రజల నుంచి ఆరోపణలు వినిసిస్తున్నాయి. మండలానికి గతంలో రెగ్యులర్ ఆర్‌ఐగా నవీనను ని యమించినా ఆయన కలెక్టర్ కార్యాలయానికి డిప్యుటైషనపై వెళ్లి పోయారు. దీంతో హెచఎల్‌సీ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి హనుమాన ప్రసాద్‌ను స్థానిక ఆర్‌ఐగా డిప్యుటేషనపై నియమించారు. ఆయన నాలుగు సంవత్సరాలు ఇక్కడ ఆర్‌ఐగా విధులు నిర్వహించారు. ఆయన కూడా గత నెల నుంచి తహసీల్దార్ కార్యాలయానికి రాలేదు. ఆయనను తిరిగి హెచఎల్‌సీ కార్యాలయానికే పంపారు. దాదాపుగా నెల రోజుల నుంచి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌ఐ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో పలు ధ్రువీకరణ పత్రాల జారీ కోసం ఆర్‌ఐ రిపోర్టు పొందేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అలాగే రీసర్వే డిప్యూటీ తహసీ ల్దార్ కార్యాలయానికి సరిగా రావడంలేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి. అంతేగాకుండా మండలపరిధిలోని నాలుగు రెవెన్యూ గ్రామాలైన చక్రాయపేట, లోలూరు, ఆకులేడు, జూలా కాల్వకు రెగ్యులర్ వీఆర్‌ఓలు లేరు. దీంతో ఇనచార్జ్‌లతోనే కొనసాగిస్తున్నారు. ఇలా తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది కొరత ఉండడం వలన వివిధ పనులపై కార్యాలయానికి వస్తే తీవ్ర జాప్యం జరుగుతోందని ప్రజలు, రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం
- సాకే బ్రహ్మయ్య, తహసీల్దార్, శింగనమల
మండలంలోని నాలుగు రెవెన్యూ గ్రామాలకు రెగ్యులర్ వీఆర్‌ఓలు లేరు. అక్కడ ఇనచార్జ్‌లను నియమించి ప్రజలు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. అలాగే తహసీల్దార్ కార్యాలయంలో ధ్రువీకరణ పత్రాల విషయంలోనూ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....