COLLECTOR: బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలి
ABN , Publish Date - Feb 22 , 2025 | 12:04 AM
ల్లాలో రేషన బియ్యం అక్రమ రవాణాను అరికట్టడానికి సవిల్ సప్లై తహసీల్దార్లు (సీఎ్‌సడీటీలు) తనిఖీలు ముమ్మరం చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన ఆదేశించారు.

పుట్టపర్తిటౌన, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రేషన బియ్యం అక్రమ రవాణాను అరికట్టడానికి సవిల్ సప్లై తహసీల్దార్లు (సీఎ్‌సడీటీలు) తనిఖీలు ముమ్మరం చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ భవనంలో జిల్లా ప్రజాపంపిణీ వ్యవస్థపై జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్‌తో కలిసి కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ రేషన బియ్యం అక్రమ రవాణాను అరికట్టడానికి సీఎ్‌సడీటీలు క్షేత్రాస్థాయిలో తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. అక్రమ రవాణాదారులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు అందిస్తున్న చౌకబియ్యం, ఇతర నిత్యావసర వస్తువుల తుకాల్లో ఎలాంటి మోసాలు జరగకుండా నిరంతర రేషన దుకాణాలు పర్యవేక్షించాలన్నారు. ప్రతి సీఎ్‌సడీటీ నెలకు ఒకసారి వారి పరిధిలోని 20 రేషన దుకాణాలు తనిఖీ చేసి, ఉన్నతాధికారులకు నివేదికలు పంపాలని ఆదేశించారు. రెవెన్యూ డివిజనల్ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలన్నారు. జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీలను తరచూ తనిఖీ చేసి, ప్రజలనుంచి అభిప్రాయాలు తీసుకుని, ఎక్కడా లోపాలు తలెత్తకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే ఎండీయూ వాహనాలను సీఎ్‌సడీటీలు పర్యవేక్షించాలన్నారు. జిల్లాలోని ప్రజా పంపిణీ వ్యవస్థ రాష్ట్రస్థాయిలో దిగువన ఉందని, ప్రథమస్థానంలోకి తీసుకురావడానికి అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. డీఎ్‌సఓ వంశీకృష్ణారెడ్డి, డీఎం అశ్వత్థనాయక్, పుట్టపర్తి, కదిరి, ధర్మవరం, పెనుకొండ ఆర్డీఓలు సువర్ణ, వీవీఎస్ శర్మ, మహేష్, ఆనంద్‌లతోపాటు 32మండలాల సీఎ్‌సడీటీలు పాల్గొన్నారు.