POLL : ఒరిగిన విద్యుత స్తంభం
ABN , Publish Date - Jan 09 , 2025 | 12:39 AM
మండల కేంద్రంలోని ఓ విద్యుత స్తంభానికి బల్బు అమరుస్తుండగా... ఉన్నట్టుండి ఆ స్తంభం ఓ పక్కకు ఒరిగిపోయిం. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరుగలేదు. శింగనమల చిన్నకాలువ వీధిలో బుధవారం సాయం త్రం విద్యుత స్తం భాలకు బల్బులు అమరుస్తున్నారు.
కరెంటు లేకపోవడంతో తప్పిన ప్రాణాపాయం
శింగనమల, జనవరి 8(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ఓ విద్యుత స్తంభానికి బల్బు అమరుస్తుండగా... ఉన్నట్టుండి ఆ స్తంభం ఓ పక్కకు ఒరిగిపోయిం. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరుగలేదు. శింగనమల చిన్నకాలువ వీధిలో బుధవారం సాయం త్రం విద్యుత స్తం భాలకు బల్బులు అమరుస్తున్నారు. విద్యుత శాఖకు చెందిన కార్మికుడు ఓ ఇసుప కరెంట్ స్తంభంపైకి ఎక్కి విద్యుత లైట్ ఏర్పాటు చేస్తుండగా ఉన్నట్టుండి ఆ స్తంభం పక్కకు ఒరిగిపోయింది. దీంతో విద్యుత కార్మికుడు కింద పడి స్వల్ప గాయలతో బయటపడ్డారు. స్తంభానికి ఉన్న కరెంట్ తీగలు దారిపై పడ్డాయి. వాటిని అటుగా వెళుతున్న చాలా మంది మహిళలు తొక్కారు. అయితే విద్యుత సరఫరా లేకపోవడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరుగలేదు. గ్రామంలో చాలా ఏళ్ల కిందట ఇసుప కరెంట్ స్తంభాలు ఏర్పాటు చేశారు. ఆ స్తంభాల అడుగుభాగాలు ప్రస్తుతం తుప్పుపట్టి చా లా ప్రమాదకరంగా ఉన్నా యి. అవి ఎప్పుడు ఒరిగి పోతాయో తెలియని పరి స్థితిలో ఉన్నాయి. ఇప్పటి కైనా విద్యుత శాఖ అధి కారులు పాత ఇసుప కరెంట్ స్తంభాలను తీసి వేసి, వాటి స్థానంలో నూ తనంగా సిమెంట్ స్తం భాలను ఏర్పాటు చేయా లని శింగనమల గ్రా మస్థులు కోరుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....