CHEETAH : వామ్మో చిరుతలు..!
ABN , Publish Date - Feb 11 , 2025 | 12:09 AM
మండలంలో చిరుతల సంచారం పెరిగింది. కొండ ప్రాంతాల్లో చిరుతలు.. మూగజీవాలపై దాడులు చేసి, చం పుతున్నాయి. దీంతో రైతులు, గొర్రెల కాపర్లు.. మూగజీవాలను కొండ ప్రాం తాలకు మేత కోసం తీసుకెళ్లాలంటే హడలిపోతున్నారు. ఈనెల 6న గోవిందరాయునిపేట సమీపంలోని మాల కొండ వద్ద ఎద్దుల సూరికి చెందిన గొర్రెల మందపై రెండు చిరుతలు దాడి చేశాయి. రెండు గొర్రెలను చంపే శాయి.

శింగనమల మండలంలో పెరిగిన సంచారం
గొర్రెలపై వరుస దాడులు
హడలెత్తుతున్న గొర్రెల కాపరులు, రైతులు
శింగనమల, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): మండలంలో చిరుతల సంచారం పెరిగింది. కొండ ప్రాంతాల్లో చిరుతలు.. మూగజీవాలపై దాడులు చేసి, చం పుతున్నాయి. దీంతో రైతులు, గొర్రెల కాపర్లు.. మూగజీవాలను కొండ ప్రాం తాలకు మేత కోసం తీసుకెళ్లాలంటే హడలిపోతున్నారు. ఈనెల 6న గోవిందరాయునిపేట సమీపంలోని మాల కొండ వద్ద ఎద్దుల సూరికి చెందిన గొర్రెల మందపై రెండు చిరుతలు దాడి చేశాయి. రెండు గొర్రెలను చంపే శారు. మరొక గొర్రె గాయపడింది. తరిమెల, గుమ్మేపల్లి, ఆనందరావుపేట, పెద్దమట్లగొంది, వెస్టునరసాపురం, నాగులగుడ్డం తండా గ్రామాల పరిధి గంపమల్లయ్య అటవీ, కొండ ప్రాంతాలు, శింగనమల, చిన్నజలాలపురం, గొవిందరాయునిపేట సమీపంలోని మాలకొండ, పెద్దకుంట, కల్లుగొంది తదితర ప్రాంతాల్లో చిరుతల సంచారం అధికంగా ఉన్నట్లు గొర్రెల కాపర్లు చెపుతున్నారు. ఆయా ప్రాంతాల్లో నిత్యం ఏదో ఒకచోట మూగజీవా లపై దాడి చేస్తున్నాయి.మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో దాహం తీర్చుకునేందుకు శింగనమల చెరువు వద్దకు వస్తున్నాయి. చిరుతలు కనిపిస్తున్నట్లు వాహనదారు లు చెబుతున్నారు. ఇప్పటికైనా అటవీ అధికారులు.. చిరుతలను పట్టుకోవాలని రైతులు, గొర్రెల కాపర్ల కోరుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....