AP SC Categorization Ordinance Approved: ఇక వర్గీకరణ
ABN , Publish Date - Apr 16 , 2025 | 04:49 AM
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్‌ను ఆమోదించింది. మిశ్రా కమిషన్ ఆధారంగా ఎస్సీలను మూడు గ్రూపులుగా వర్గీకరించి, రిజర్వేషన్లు నిర్ణయించింది

ఆర్డినెన్స్‌కు మంత్రిమండలి ఓకే
నాడు బాబు హయాంలోనే ఎస్సీ వర్గీకరణ
తిరిగి ఆయన నేతృత్వంలోనే ఆర్డినెన్స్
ఆ ఎజెండాలో తొలి అంశంగా చేర్చి ఆమోదం
మూడు కేటగిరీలుగా ఎస్సీలను వర్గీకరించిన మిశ్రా కమిషన్
రెల్లి, మాదిగ, మాల ఉపకులాలు గ్రూప్-1, 2, 3గా విభజన
వరుసగా 1, 6.5, 7.5% రిజర్వేషన్
వచ్చే అసెంబ్లీ భేటీలో చట్టబద్ధత
అమరావతి, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణ అమలుకు చిక్కులు తొలగిపోయాయి. ప్రభుత్వం ఇప్పటికే అన్ని కసరత్తులు పూర్తిచేసి విద్యా, ఉద్యోగ రంగాల్లో వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్లు అమలు చేసేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ కోసం వేసిన రాజీవ్‌రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను గతనెల 17న కేబినెట్ ఆమోదించింది. మంగళవారం కేబినెట్‌లో మొదటి అజెండాగా చేర్చి వర్గీకరణపై ఆర్డినెన్స్‌ను ఆమోదించారు. ఇక గవర్నర్ ఆమోదంతో ఎస్సీ వర్గీకరణ రాష్ట్రంలో అమల్లోకి రానుంది. నిజానికి, ఈ ప్రక్రియకు గతంలో తన హయాంలోనే చంద్రబాబు నాంది పలకడం విశేషం. ఎస్సీల్లో మాదిగలు, రెల్లి కులస్థులు ఆర్థికంగాను, సామాజికంగాను వెనుకబడి ఉన్నారంటూ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను ఉమ్మడి ఏపీలో ఆయన చేపట్టారు. అయితే, సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. తిరిగి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతోనే మళ్లీ కార్యరూపం దాల్చింది. ఈ క్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మిశ్రా కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఎస్సీలను గ్రూప్-1, 2, 3లుగా కమిషన్ విభజించింది. గ్రూప్-1లో అత్యంత వెనుకబడిన రెల్లి కులస్థులను చేర్చింది. జనాభా ప్రాతిపదికన వారికి 1 శాతం రిజర్వేషన్ కల్పించింది. జనాభా దామాషాలో రెండోస్థానంలో ఉన్న మాదిగల ఉపకులాలను గ్రూప్-2 కింద చేర్చి, 6.5 శాతం రిజర్వేషన్, జనాభా ఎక్కువగా ఉన్న మాలలను గ్రూప్-3 కింద పరిగణించి 7.5% కేటాయించింది.
మరో నెలపాటు కమిషన్
రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్‌ను మరో నెల పాటు.. అంటే మే 11 వరకు కొనసాగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులిచ్చింది.
గ్రూపు 1: రెల్లి, ఉపకులాలు 12, రిజర్వేషన్ : 1 శాతం
1. రెల్లి, 2.బాపురి, 3.చాచాటి, 4.చండాల, 5.దండాసి, 6.డోమ్, డోంబారా, పైడి,పానో, 7.ఘాసీ, హడ్డి, చాచండి, 8.గోదగలి, గోదగుల, 9.మోహ్తర్, 10.పాకీ, మోతి, తోటి, 11. పామిడి, 12. సప్రు
గ్రూపు 2: మాదిగ, ఉపకులాలు 18, రిజర్వేషన్ : 6.5శాతం
1.మాదిగ, 2.అరుంధతీయ, 3.బిండ్లా,4.చామర్, మోచి, మూచి, చామర్-రవిదాస్, చామర్-రోహిదాస్, 5. చంబార్, 6.ధక్కల్, డొక్కల్వర్, 7. ధోర్, 8. గోదారి, 9.గోసంగి, 10.జగ్గలి, 11. జంబువులు, 12.కొలుపులవాండ్లు, 13. మాదిగ దాసు, మస్తీన్, 14. మాంగ్, 15. మాంగ్‌గరోడి, 16. మాతంగి, 17. సముగర, 18. సింగోళ్లు, చిందోళ్లు.
గ్రూప్ 3: మాల, ఉపకులాలు 29, రిజర్వేషన్ : 7.5 శాతం
1. ఆదిద్రావిడ 2. అనముక, 3. ఆరాయ్ మాల, 4. ఆర్వా మాల, 5. బరికి, 6. బ్యూగార, బ్యూగారి 7. చాలవడి, 8. ఎల్లమలావారు, ఎల్లమ్మలవాండ్లు, 9.హోలెయ, 10. హోలెయ దాసరి, 11. మాదసీ కురవ, మాదరి కురవ, 12.మహర్ 13. మాల, మాల అయ్యవారు, 14.మాలదాసరి, 15. మాల దాసు, 16. మాల హన్నై, 17. మాలజంగం, 18. మాల మస్తీ, 19.మాల సాలే, నెట్టికాని, 20. మాల సన్యాసి, 21.మన్నే, 22. ముండాల, 23. సంబం, 24. యాతాల, 25.వల్లువన్, 26. ఆదిఆంధ్ర, 27.మష్టి, 28.మిథ అయ్యాల్వార్, 29. పంచమ, పరియా.
ఈ వార్తలు కూడా చదవండి..
Dy Collectors Transfer: భారీగా డిప్యూటీ కలెక్టర్లు బదిలీ
Saraswati Pushkaralu: సరస్వతి పుష్కరాలు.. ఎప్పటి నుంచంటే..
National Herald Case: ఈడీ ఛార్జ్‌షీట్లో సోనియా, రాహుల్ పేర్లు
BRS MLA: ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ వ్యాఖ్యలపై స్పందించిన కొత్త ప్రభాకర్ రెడ్డి
Farmers: దేశ ప్రజలకు అదిరిపోయే వార్త
Errabelli Dayakar Rao: అలా అయితే.. రాజకీయాల నుంచి తప్పుకొంటా..
PM Modi: ఏపీకి ప్రధాని మోదీ.. ఎప్పుడంటే..
వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ
Hyderabad Summit:హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ..
For AndhraPradesh News And Telugu News