Drought Hit Mandals: ఏపీ సర్కార్ కీలక ప్రకటన.. ఆ 51 మండలాలు..

ABN, Publish Date - Mar 31 , 2025 | 03:53 PM

Drought Hit Mandals: కరువు మండలాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితుల ఆధారంగా వీటిని ఎంపిక చేసింది. కలెక్టర్ల ద్వారా సర్వే చేయించి ఈ మండలాలను ప్రకటించింది. ఈమేరకు రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్‌ ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.

Drought Hit Mandals: ఏపీ సర్కార్ కీలక ప్రకటన.. ఆ 51 మండలాలు..
Drought Hit Mandals

అమరావతి: గత ఏడాది ఏపీలో సాధారణ స్థాయిలో కూడా వర్షాలు పడలేదు.. అయితే గత జగన్ ప్రభుత్వం మాత్రం కరువు మండలాలను (Drought Hit Mandals) ప్రకటించడంలో నిర్లక్ష్యం చేసింది. మొక్కుబడిగా కరువు మండలాలను ప్రకటించి చేతులు దులుపుకుంది. రైతుల ఇబ్బందులను, స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న కూటమి ప్రభుత్వం కరువు మండలాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే కరువు మండలాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్‌ ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.


ఆ నివేదిక ఆధారంగా..

ఏపీలో కరువు మండలాలుగా 51 మండలాలను ప్రకటించారు. 37 మండలాల్లో తీవ్రమైన కరువు ఉన్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు. 14 మండలాల్లో కరువు ప్రభావం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రబీ సీజన్ 2024-25 కరువు మండలాలను వెల్లడిస్తూ ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల రాష్ట్ర విపత్తుల నిర్వహణ కార్యాలయంలో నిర్వహించిన కరువు ప్రభావ కమిటీ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖలు సమర్పించిన నివేదికలను కరువు ప్రభావ కమిటీ నిశితంగా పరిశీలించింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన నివేదికలను తాము దృష్టిలో ఉంచుకుని, వర్షపాతం లోటు, పంటల నష్టం, భూగర్భ జలాల స్థాయి, వ్యవసాయ స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని సిసోడియా ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Kakani Police Notice: విచారణకు కాకాణి డుమ్మా.. రావాల్సిందే అన్న పోలీసులు

Lokesh On Visakhapatnam: ఏపీ ఐకానిక్ క్యాపిటల్‌గా విశాఖ

Kethireddy: ప్రైవేట్ జెట్ నడిపిన కేతిరెడ్డి.. వీడియో వైరల్

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 31 , 2025 | 06:55 PM