Balimela Project Delay: బలిమెల హైడల్ ప్లాంట్లపై నిర్ణయం వాయిదా
ABN , Publish Date - Apr 16 , 2025 | 03:49 AM
బలిమెల వద్ద హైడల్ ప్రాజెక్టులపై నిర్ణయం వాయిదా వేసిన సీఎం. పవన్ కల్యాణ్ లేకుండా చర్చలు సరిగ్గా జరగవని అభిప్రాయపడ్డారు

పవన్ లేకుండా చర్చ సరికాదన్న సీఎం
అమరావతి, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అందుబాటులో లేకపోవడంతో.. బలిమెల (చిత్రకోట) వద్ద ‘మెస్సర్స్ ఒరిస్సా పవర్ కన్సార్టియం లిమిటెడ్’ చేపట్టదలచిన 2 మినీ హైడల్ ప్రాజెక్టులపై కేబినెట్ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈ అంశాన్ని వచ్చే మంత్రివర్గ సమావేశంలో చర్చకు పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అత్యంత ప్రధానమైన ఈ అంశాన్ని ఉప ముఖ్యమంత్రి లేకుండా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. బలిమెల ఆనకట్ట వద్ద 30 మెగావాట్ల చొప్పున సామర్థ్యం కలిగిన రెండు పవర్ హౌస్‌లను నిర్మించేందుకు ఒడిసా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విద్యుత్‌ను రెండు రాష్ట్రాలూ చెరిసగం పంచుకోవాలని ఒప్పందం కూడా జరిగింది.