Share News

Chandrababu Home Ceremony: చంద్రబాబు ఇంటి నిర్మాణానికి నేడు భూమిపూజ

ABN , Publish Date - Apr 09 , 2025 | 06:00 AM

రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నారు. 8.50 గంటలకు జరిగిన ఈ భూమి పూజను 5 ఎకరాల్లో, వెలగపూడి సచివాలయం సమీపంలో చేపడుతున్నారు

Chandrababu Home Ceremony: చంద్రబాబు ఇంటి నిర్మాణానికి నేడు భూమిపూజ

  • ఉదయం 8.50కి ముహూర్తం

  • సచివాలయం దగ్గరలో ఐదెకరాల్లో నిర్మాణం

అమరావతి, తుళ్లూరు, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత ఇంటిని నిర్మించుకుంటున్నారు. వెలగపూడి సచివాలయం సమీపాన ఈ-9 రహదారి పక్కనే ముఖ్యమంత్రి కుటుంబం ఐదు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. నాలుగు వైపులా రోడ్లు, సచివాలయానికి, హైకోర్టుకు సమీపంలో ఉండేలా చూసి స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ స్థలంలో బుధవారం ఉదయం 8.50 గంటలకు చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి భూమి పూజ చేయనున్నారు. ఏడాదిన్నరలో ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి కరకట్ట వద్ద చంద్రబాబు నివాసం ఉంటూ పాలన సాగించారు. రాజధాని నిర్మాణానికి తొలి ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబు.. ఇంతవరకూ సొంత ఇంటి నిర్మాణంపై దృష్టి పెట్టలేదు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చాక.. తొలి రోజు నుంచే రాజధానినిర్మాణంపై దృష్టి సారించారు. వైసీపీ హయాంలో నిలిచిపోయిన పనులను పట్టాలు ఎక్కించారు. అమరావతి పనులు గాడిన పడటంతో సొంత ఇంటి వ్యవహారంపై చంద్రబాబు దృష్టి పెట్టారు. పలు ప్రాంతాల్లో స్థలం కోసం అన్వేషించి.. ఎట్టకేలకు వెలగపూడి సచివాలయం వెనుక ్జ్జకిలోమీటర్‌ దూరంలో ఐదెకరాలు కొన్నారు. సీఎం సొంత ఇంటి నిర్మాణం చేపడుతుండటంతో రాజధాని ప్రాంత ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కాగా, ప్రైవేటు కార్యక్రమం కావడంతో రాజధాని రైతులతో సహా ఎవరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదు. అయితే సంప్రదాయం ప్రకారం సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు బహూకరిస్తామని వెలగపూడి గ్రామస్తులు చెప్పగా.. పోలీసులు అనుమతించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు..

అమ్మాయితో రాజకీయమా..

సీతమ్మవారికి తాళి కట్టిన వైసీపీ ఎమ్మెల్యే

For More AP News and Telugu News

Updated Date - Apr 09 , 2025 | 06:00 AM