Share News

CM Chandrababu: శివరాత్రి శుభాకాంక్షలు: సిఎం చంద్రబాబు

ABN , Publish Date - Feb 26 , 2025 | 08:37 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. వేకువ జాము నుంచే శ్రీశైలంలో పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.

CM Chandrababu: శివరాత్రి శుభాకాంక్షలు: సిఎం చంద్రబాబు
CM Chandrababu Naidu Greetings..

అమరావతి: పవిత్రమైన మహాశివరాత్రి (Mahashivarathri) పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu) ప్రజలందరికీ (People) శుభాకాంక్షలు (Greetings) తెలిపారు. నదీ స్నానాలు, ఉపవాసం, జాగరణ దీక్షలను అత్యంత నిష్ఠతో ఆచరిస్తున్న భక్తులకు ఆ శంకరుడు సకల శుభాలను, ఆనంద ఆరోగ్యాలను అనుగ్రహించాలని కోరుకుంటున్నానని పేర్కొంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.

ఈ వార్త కూడా చదవండి..

తెలంగాణలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు..


వైభవంగా మహాశివరాత్రి వేడుకలు..

కాగా ఆంధ్రప్రదేశ్‌లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. వేకువ జాము నుంచే శ్రీశైలంలో పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఉభయ దేవాలయాల్లో వెలసిన శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను భక్తులు దర్శించుకుంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. మహానంది యాగంటి కాల్వబుగ్గ ఓంకారం ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. కోనేరులలో భక్తుల పుణ్య స్నానాలు చేస్తున్నారు.


శివనామస్మరణతో భక్తుల సందడి..

పల్నాడు జిల్లా, పంచారామ క్షేత్రం. అమరావతిలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం తెల్లవారు జామున మూడుగంటలకు బిందెతీర్ధం, పంచామృతాభిషేకాలతో శివరాత్రి పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. అమరేశ్వరాలయంలో శివనామస్మరణతో భక్తుల సందడి నెలకొంది. పల్నాడు జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో మహాశివ రాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. త్రికోటేశ్వరునికి తొలిపూజతో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము 3 గంటల నుంచే భక్తులను త్రికోటేశ్వరుని దర్శనానికి అనుమతి ఇచ్చారు. తొలిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, కుటుంబం సభ్యులు పాల్గొన్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో పంచారరామాలు శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. భీమవరం పంచారామక్షేత్రం సోమారామంకు భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా సోమేశ్వరస్వామికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేస్తున్నారు. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. సోమేశ్వరస్వామి భక్తులకు గోధుమ వర్ణంలో దర్శనం ఇస్తున్నారు. ఈ సందర్భంగా స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు

తెలీదు.. మరిచిపోయా.. గుర్తులేదు..

రిజిస్ర్టేషన్ల శాఖ డీఐజీ కిరణ్‌ సస్పెన్షన్‌

తెలుగు మీడియం చదివితే ఉద్యోగాలు వస్తాయా?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 26 , 2025 | 08:37 AM