తల్లిని తిట్టాడని తండ్రిపై దాడి
ABN , Publish Date - Apr 04 , 2025 | 01:31 AM
కొడుకు చేతిలో తండ్రి హతమైన సంఘటన శ్రీరంగరాజపురం మండలం పాపిరెడ్డిపల్లెలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాపిరెడ్డిపల్లెకు చెందిన శ్రీనివాసులు మందడి(60) మద్యానికి బానిసై భార్య జ్యోతితో రోజూ గొడవపడేవాడు.

-మృతిచెందిన పాపిరెడ్డిపల్లెవాసి
శ్రీరంగరాజపురం, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): కొడుకు చేతిలో తండ్రి హతమైన సంఘటన శ్రీరంగరాజపురం మండలం పాపిరెడ్డిపల్లెలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాపిరెడ్డిపల్లెకు చెందిన శ్రీనివాసులు మందడి(60) మద్యానికి బానిసై భార్య జ్యోతితో రోజూ గొడవపడేవాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం మద్యం మత్తులో భార్యతో గొడవ పడటంతో అక్కడే ఉన్న కుమారుడు నాగరాజు దాన్ని తట్టుకోలేక ఇటుక రాయితో తండ్రిపై దాడి చేశాడు. దీంతో శ్రీనివాసులు మందడి తలకు తీవ్రగాయమై మృతి చెందినట్లు అతడి అన్న సుబ్రహ్మణ్యం మందడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ హనుమంతప్ప, ఎస్‌ఐ సుమన్ తమ సిబ్బందితో కలిసి గురువారం సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.