నడక దారిలో భారీ కొండచిలువ
ABN , Publish Date - Apr 12 , 2025 | 01:50 AM
అలిపిరి కాలినడకదారిలో కొండచిలువ పట్టుబడింది. ఏడోమైలు వద్ద రోడ్డుపైకి శుక్రవారం తెల్లవారుజామున 14 అడుగుల పొడవైన కొండచిలువ వచ్చింది.

అలిపిరి కాలినడకదారిలో కొండచిలువ పట్టుబడింది. ఏడోమైలు వద్ద రోడ్డుపైకి శుక్రవారం తెల్లవారుజామున 14 అడుగుల పొడవైన కొండచిలువ వచ్చింది. దీంతో వాహనదారులు, కాలినడక భక్తులందరూ హడలిపోయారు. సుమారు 15 నిమిషాల పాటు వాహనాలు కూడా నిలిచిపోయాయి. పాములు పట్టే టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగి భాస్కర్‌నాయుడికి సమాచారం ఇవ్వడంతో, ఆయన అక్కడికి చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకున్నాడు. అనంతరం పామును అవ్వాచారి కోన లోయలో విడిచిపెట్టారు.
- తిరుమల, ఆంధ్రజ్యోతి