ఔను.. వారు పరీక్షలు రాస్తున్నారు!
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:21 AM
ఒకే బెంచీపై ఇద్దరు.. పైగా ఇరుకిరుకుగా కూర్చొని ఉన్న విద్యార్థులు. వీరిని చూస్తుంటే పాఠాలు వింటున్నట్లు ఉంది కదూ. కానే కాదు. అందరూ పరీక్షలు రాస్తున్నారు. ఇది ఎస్వీయూనివర్సిటీ దూరవిద్య కింద యూజీ, పీజీ, ఎంబీఏ కోర్సులు చదువుతున్న విద్యార్థుల కోసం చిత్తూరులోని ఎన్పీ సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రం.

ఎస్వీయూ దూరవిద్య పరీక్షల నిర్వహణ తీరిది
ఒకే బెంచీపై ఇద్దరు.. పైగా ఇరుకిరుకుగా కూర్చొని ఉన్న విద్యార్థులు. వీరిని చూస్తుంటే పాఠాలు వింటున్నట్లు ఉంది కదూ. కానే కాదు. అందరూ పరీక్షలు రాస్తున్నారు. ఇది ఎస్వీయూనివర్సిటీ దూరవిద్య కింద యూజీ, పీజీ, ఎంబీఏ కోర్సులు చదువుతున్న విద్యార్థుల కోసం చిత్తూరులోని ఎన్పీ సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రం. మరోవైపు ఈ పరీక్ష కేంద్రం ఆవరణలో చిట్టీలు కూడా దర్శనమిచ్చాయి. మాస్ కాపీయింగ్ ఆరోపణలూ లేకపోలేదు. ఈనెల రెండో తేదీన మొదలైన పరీక్షలు 23వ తేదీవరకు ఇక్కడ జరుగుతాయి. పైకి పకడ్బందీగా నిర్వహిస్తున్నామని చెబుతున్నా.. లోపల పరిస్థితి ఇలా ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కళాశాల ప్రిన్సిపాల్ మనోహర్‌ను వివరణ కోరగా.. తమ కళాశాల విద్యార్థినులకు తరగతులు జరుగుతున్నాయని, అందువల్ల ఆడిటోరియంలో పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. జంబ్లింగ్ విధానం వల్ల ఒక్కో బెంచీపై ఇద్దరు విద్యార్థులను కూర్చోబెట్టామని తెలిపారు. ఇకనైనా ఈ పరీక్షల నిర్వహణపై ఎస్వీయూ దూరవిద్య అధికారులు దృష్టి పెట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.
- చిత్తూరు సెంట్రల్, ఆంధ్రజ్యోతి