Basavatarakam Trust: బసవతారకం ట్రస్ట్ కేసులో లక్ష్మీపార్వతికి ఎదురుదెబ్బ
ABN , Publish Date - Apr 01 , 2025 | 06:09 AM
‘బసవతారకం ట్రస్టు’కు మేనేజింగ్ ట్రస్టీగా లక్ష్మీపార్వతి నియమించాలనే పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సప్లిమెంటరీ విల్లును నిరూపించే క్రమంలో తప్పిదం జరిగిందని స్పష్టం చేసింది.

విల్లును నిరూపించడంలో కోర్టు ప్రొసీజర్ పాటించలేదు: హైకోర్టు
దిగువ కోర్టు ఆదేశాలు కొట్టివేత
హైదరాబాద్, మార్చి 31(ఆంధ్రజ్యోతి): ‘బసవతారకం ట్రస్టు’కు తనను మేనేజింగ్ ట్రస్టీగా నియమించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌లో లక్ష్మీపార్వతికి ఎదురుదెబ్బ తగిలింది. 1995, నవంబరు 18న నందమూరి తారకరామారావు ఎగ్జిక్యూట్ చేసినట్లుగా పేర్కొంటున్న సప్లిమెంటరీ విల్లుపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విల్లును నిరూపించే క్రమంలో సిటీ సివిల్ కోర్టు(దిగువ కోర్టు) చట్టం నిర్దేఽశించిన ప్రొసీజర్‌ను అనుసరించలేదని స్పష్టం చేసింది. సప్లిమెంటరీ విల్లుపై సాక్షి సంతకం చేసిన జె. వెంకటసుబ్బయ్య వారసుడు.. జేవీ ప్రసాద్‌రావును సాక్షి(పీడబ్ల్యూ-3)గా గుర్తిస్తూ దిగువ కోర్టు 2018లో ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టేసింది. విల్లుపై సాక్షి సంతకాలు చేసిన జె.వెంకటసబ్బయ్య, వై తిరుపతిరావుకు సమన్లు ఇవ్వకుండా.. వారు ఇద్దరూ చనిపోయినట్లు ఎలాంటి ఆధారాలు లేకుండా వారి వారసులను సాక్షులుగా స్వీకరించడం చెల్లదని పేర్కొంది. విల్లుపై సాక్షి సంతకం చేసిన వెంకట సుబ్బయ్య మరణించినట్లు నోటి మాట ఆధారంగా ఆయన కుమారుడు జేవీ ప్రసాద్‌రావును పీడబ్ల్యూ-3గా గుర్తించడం చెల్లదని పేర్కొంది. 1995లో రామారావు రాసినట్లు పేర్కొంటున్న సప్లిమెంటరీ విల్లు ప్రకారం బసవతారకం ట్రస్టుకు తనను మేనేజింగ్ ట్రస్టీగా నియమించాలని 2009లో లక్ష్మీపార్వతి సిటీ సివిల్ కోర్టులోట్రస్టు ఓపీ(పిటిషన్) దాఖలు చేశారు. సప్లిమెంటరీ విల్లులో సంతకం చేసిన వెంకట సుబ్బయ్య మరణించిన నేపథ్యంలో ఆయన కుమారుడు ప్రసాద్‌రావును విట్‌నె్‌సగా గుర్తించాలని పిటిషనర్ లక్ష్మీపార్వతి కోరారు. అలాగే, తన తండ్రి వెంకట సుబ్యయ్య మరణించారని.. రామారావు విల్లు రాసిన విషయం నిజమేనని, తన తండ్రి తనకు సమాచారం ఇచ్చారని జేవీ ప్రసాద్‌రావు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దీంతో దిగువ కోర్టు పీడబ్ల్యూ-3గా ప్రసాద్‌రావును విచారించేందుకు అంగీకరించింది. అయి తే.. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ.. బసవతారకం ట్రస్ట్, నందమూరి బాలకృష్ణ, నందమూరి హరికృష్ణ 2019లో హైకోర్టులో సివిల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వార్తలు కూాడా చదవండి
Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది
HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..
Read Latest Telangana News And Telugu News