Deputy CM Pawan Kalyan: అందుకే ఏన్‌డీఏకు పట్టం కట్టారు..
ABN, Publish Date - Jan 08 , 2025 | 05:19 PM
రైల్వే జోన్ శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు విచ్చేశారు. ఆయనకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ..
ఏపీ ప్రజలు ఎన్‌డీఏను నమ్మారని అందుకే పట్టం కట్టారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రైల్వే జోన్‌తో పాటూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు విచ్చేశారు. ఆయనకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ వరకు రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగిన సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ధైర్య సాహసాలతో నింపితే అది పటిష్ట భారత్‌గా మారుతుందని, సదాశయంతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిస్తే.. అది స్వచ్ఛ భారత్ అవుతుందని తెలిపారు. సదుద్దేశం, సదాశయం ఉంటే ఏదైనా సాధ్యమేనని చెప్పారు.
ప్రజలు ఏన్‌డీఏ ప్రభుత్వాన్ని నమ్మారని, అందుకే అండగా నిలబడ్డారని చెప్పారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ప్రధాని మోదీ ఆశయమన్నారు. బలమైన భారత్ కోసం ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రధాని కృషి చేస్తున్నారని కొనియాడారు. మోదీ రాకతో ఏపీకి రూ.2.1 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, అలాగే 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. ప్రజల మనసు గెలుచుకున్న నాయకుడు మోదీ అంటూ కొనియాడారు. గత ఐదేళ్లలో అవినీతి, అరాచక పాలనతో ఏపీలో అంధకారం నెలకొందని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న దార్శనికులంటూ పవన్ కళ్యాణ్ కొనియాడారు.
Updated Date - Jan 08 , 2025 | 06:19 PM