యనమల రాజకీయ ప్రస్థానంపై పుస్తకం
ABN , Publish Date - Apr 08 , 2025 | 12:33 AM
తుని రూరల్, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): యనమల రామకృష్ణుడు రాజకీయ జీవితంపై ‘42వ వసంతాల యనమల రాజకీయ ప్రస్థాన ం’ పేరుతో పుస్తకం ప్రచురించారు. ఈనెల 10న కాకినాడ జిల్లా తునిలో ఈ పుస్తకావిష్కరణ, ఆత్మీయ సన్మాన వేడుకను అట్టహాసంగా నిర్వహించేందుకు కూటమి శ్రేణులు సన్నద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా తునిలో మాజీ ఎమ్మెల్యే, జనసేన నేత రాజా అశోక్‌బాబు పార్టీ శ్రేణులతో కలిసి బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ

10న తునిలో పుస్తకావిష్కరణకు ఏర్పాట్లు
ముఖ్య అతిథులుగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోంమంత్రి అనిత
తుని రూరల్, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): యనమల రామకృష్ణుడు రాజకీయ జీవితంపై ‘42వ వసంతాల యనమల రాజకీయ ప్రస్థాన ం’ పేరుతో పుస్తకం ప్రచురించారు. ఈనెల 10న కాకినాడ జిల్లా తునిలో ఈ పుస్తకావిష్కరణ, ఆత్మీయ సన్మాన వేడుకను అట్టహాసంగా నిర్వహించేందుకు కూటమి శ్రేణులు సన్నద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా తునిలో మాజీ ఎమ్మెల్యే, జనసేన నేత రాజా అశోక్‌బాబు పార్టీ శ్రేణులతో కలిసి బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ 42 ఏళ్ల యనమల రాజకీయ ప్రస్థానంలో ఆయన మచ్చలేని నాయకుడిగా వెలుగొందారని, ఇది రాజకీయాల్లో అద్భు త ఘట్టమని అన్నారు. సుదీర్ఘ రాజకీయాల్లో యనమల స్పీకర్‌గా, పలుమార్లు మంత్రిగా, ఎమ్మెల్యేగా పదవులను అలంకరించి ఆ పదవులకే వన్నె తెచ్చేలా స్ఫూర్తిదాయకమైన పాలన అందించారన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైన వ్యక్తిగా గొప్ప వ్యక్తిత్వం ఉన్న తుని ప్రాంతవాసి అయిన ఆయనను ఈ నెల 10న తునిలో సత్కరించుకునే అవకాశం ఈప్రాంత ప్రజల అదృష్టమన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోంమంత్రి అనిత విచ్చేయనున్నారని తెలి పారు. ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు కూడా హాజరుకానున్నారన్నారు. కూటమి పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించే కార్యక్రమానికి ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కొచ్చెర్లపాటి రూపాదేవి, మున్సిపల్ మా జీ చైర్మన్, టీడీపీ తుని పట్టణాధ్యక్షుడు యినిగంటి సత్యనారాయణ, సుర్ల లోవరాజు, మాజీ కౌన్సిల ర్లు మళ్ల గణేష్, జల్లు వాసు, కుక్కడుపు బాలాజీ, టీడీపీ నాయకులు తమరాన సత్యనారాయణ, ఆవుగడ్డి వెంకటరమణ, తమరాన రామకృష్ణ, కోడా వెంకటరమణ పాల్గొన్నారు.