సునీల్‌ది ఆత్మహత్య కాదు.. హత్య?
ABN , Publish Date - Apr 08 , 2025 | 12:20 AM
సీతా నగరం మండలం రాపాక పంచాయతీ పరిధిలోని శ్రీరామనగర్ రాజుగారి గార్డెన్స్ వద్ద సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సీతానగరం,ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి) : సీతా నగరం మండలం రాపాక పంచాయతీ పరిధిలోని శ్రీరామనగర్ రాజుగారి గార్డెన్స్ వద్ద సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంబులెన్స్‌లో ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్న సునీల్ మృతదేహం ఉంచుకుని ఆందోళనకు దిగారు. మృతుడిది హత్య అని బంధువులు, స్నేహితులు సోమవారం రోడ్డెక్కా రు. ఫంక్షన్‌హాల్ యజమాని అడ్డాల హరికృష్ణరాజు, సునీల్‌తో ఉన్న మహిళ కలసి హత్యచేసినట్టు అనుమానంగా ఉందన్నారు. వారిని అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేసి దర్యాపు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాన రహదారికి అడ్డంగా నిలబడి ధర్నా చేసే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డు కున్నారు. మృతదేహంతో ఆందోళనకు ప్రయత్నించడంతో 17 మంది అదుపులోకి తీసుకుని పోలీస్ వేన్ ఎక్కించి కోరుకొండ తరలించే ప్రయత్నం చేశారు. తరువాత అక్కడున్న వారిని చెదరగొట్టి ఆంబులెన్స్‌లో ఉన్న మృతదేహాన్ని బంధువులకు అప్పగించి పంపించారు. దీనిపై సీఐ బాలశౌరిని వివరణ కోరగా మృతుడు సునీల్‌కు వరుసకు మరదలైన మహిళ హైదరాబాద్ నుంచి ఆదివారం ఉదయం ప్రైవేట్ బస్‌లో సీతానగరం చేరుకుని సునీల్‌ని కలిసిం దన్నారు. తనతో పాటు ఉండాలని అడిగినా కాదనడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. ఇది హత్యగా అనుమానం వ్యక్తం చేస్తున్నందున అన్ని కోణాల్లోను దర్యాప్తు చేస్తామన్నారు.