సత్యదేవుని ఆలయ పునఃనిర్మాణ ప్రారంభం దినోత్సవం
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:38 AM
అన్నవరం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుని ఆలయం పునఃనిర్మించి 13 ఏళ్లు పూర్తిచేసుకుని 14వ ఏటా అడుగిడిన సందర్భాని పురస్కరించుకుని శుక్రవారం ఆల యంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. మూలవరులకు అభిషేకం అనంతరం స్వామివారికి లక్షపత్రిపూ

అన్నవరం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుని ఆలయం పునఃనిర్మించి 13 ఏళ్లు పూర్తిచేసుకుని 14వ ఏటా అడుగిడిన సందర్భాని పురస్కరించుకుని శుక్రవారం ఆల యంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. మూలవరులకు అభిషేకం అనంతరం స్వామివారికి లక్షపత్రిపూజ, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు నిర్వహించారు. ఆలయాన్ని వివిధ సుగందభరిత పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అధికసంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. 2012 ఆలయ శిఖర ప్రతిష్ఠలో పాలుపంచుకున్న ఆరుగురు పండితులకు ఈవో వీర్ల సుబ్బారావు దుశ్శాలువా కప్పి పుష్పమాలాంకృతలను చేసి నగదు పురస్కారంతో సత్కరించారు. సత్కారం అందుకున్నవారిలో ఆ కొండి వ్యాసమూర్తి, గొర్తి సుబ్రహ్మణ్య ఘనాపా ఠి, గాడేపల్లి సత్యనారాయణ తదితరులున్నారు.
మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి పూజలు
సత్యదేవుని సన్నిధిలో శుక్రవారం మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివజ్ఞానం కుటు ంబసభ్యులతో స్వామిని దర్శించి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ సహాయ కమిషనర్ రామ్మోహనరావు, పీఆర్వో కృష్ణారావు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనాలు అందజేయగా అదికారులు స్వామివారి చిత్రపఠం, మెమెంటో అందజేశారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ భాస్కరప్రసాద్ తదితరులున్నారు.
ఎట్టకేలకు ప్రసాద్ స్కీం పనులకు టెండర్లు ఖరారు
అన్నవరం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): సత్యదేవుని సన్నిధిలో భక్తుల సౌకర్యార్థం కేంద్రప్రభుత్వ పథకం ప్రసాద్ స్కీం పనులకు సంబంధించి టెండర్లు ఖరారైనట్టు టూరిజంశాఖ అధి కారులు తెలిపారు. సుమారు రూ.25.32 కోట్ల అంచనాలతో రూపొందించిన ఈ పనులకు సుమారు ఏడాది క్రితం ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్ నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనం తరం వీటికి టెండర్లు పిలవగా సాంకేతిక కారణాలతో వీటిని నిలుపుదల చేసి రీటెండర్లను పిలిచారు. రూ.25.32 కోట్లతో పిలిచిన టెండర్లను విశాఖపట్నంకు చెందిన ఒక సంస్థ టెం డర్ 16శాతం తక్కువకు కోడ్ చేసి టెండర్ దక్కించుకుంది. త్వరలో అగ్రిమెంట్ పూర్తిచేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. వీటితో ప్రధానంగా నూతన అన్నదాన భవనం, క్యూ కాంప్లెక్జ్, మరుగుదొడ్లు, 2 ఎలక్ట్రికల్ బస్సులు, చార్జింగ్‌స్టేషన్లు ఏర్పాటుకానున్నాయి. ఈ పను లకు దేవస్థానానికి ఏ సంబంధం ఉండదు. టూరిజంశాఖ ఆధ్వర్యంలోనే చేపట్టనున్నారు.
రెండు బోర్లకు భూమిపూజ
ఏలేరు నీటిని రిజర్వాయర్‌లోకి మళ్లింపు అంశంపై అసంపూర్తిగా సమావేశం
వేసవిలో భక్తులకు నీటి సమస్యలు ఏర్పడ కుండా త్వరితగతిన రూ.10లక్షలతో 2 బోర్లు ఏర్పాటు కు శుక్రవారం ఈవో వీర్ల సుబ్బారావు భూమిపూజ నిర్వహించారు. ఈ 2 బోర్ల ద్వారా నీటిని సత్యగిరి కొండపై వాటర్‌ట్యాంక్‌కు చేర్చి హరిహరసదన్, శివసదన్, విష్ణుసదన్, అతిథి గృహాలు, ఉచిత కల్యాణమండపాలకు అందజేయడం జరుగుతుందని ఈవో తెలిపారు. మరోపక్క పంపాజలాశయంలోకి ఏలేరు నీటిని రిజర్వాయర్‌లోకి మళ్లించే విషయమై జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్‌తో ఇరిగేషన్, పోల వరం అధికారులు నిర్వహించిన సమావేశం అసంపూర్తిగా ముగిసింది. పోలవరం పనులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక పైప్‌లైన్ ఏర్పాటుకు అంచనాలు రూపొందించి అందజేస్తామని, దీని నిధులు ఇప్పించాలని పోలవరం అధికారులు కోరారు. సుమారు రూ.40 లక్షలు వ్యయమవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు.