Somu Veerraju: సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 08 , 2025 | 06:02 PM
Somu Veerraju: రెండో సారి ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు రాజమండ్రిలో అభినంద సభ జరిగింది. ఈ సభలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే దక్షిణాదిలోని తెలంగాణ, తమిళనాడులో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.

రాజమండ్రి, ఫిబ్రవరి 08: రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ పరిగెడుతోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పష్టం చేశారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో పొత్తుల విషయంలో రాజకీయ వ్యూహం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రెండో సారి ఎమ్మెల్సీగా సోము వీర్రాజు ఎన్నికైయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం రాజమండ్రిలో సోము వీర్రాజుకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కేవలం రోజుకు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతారన్నారు. ఎవరిని ఎక్కడ నొక్కాలో బీజేపీని ఎలా పైకి తీసుకురావాలో.. అమిత్ షా నిరంతరం ఆలోచిస్తూ ఉంటారన్నారు. అయితే అమిత్ షా ఆలోచనలు దేశం కోసం, రాజకీయం కోసమేనని ఆయన స్పష్టం చేశారు. అవినీతి రాజకీయ నేతలను మనం ఈ దేశంలో బతకనివ్వమన్నారు. ఇదే బీజేపీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మనం వైసీపీ అని అందరూ అనుకున్నారని.. కానీ గత వైసీపీ ప్రభుత్వానికి నెల నెల అప్పులు ఇప్పించామన్నారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మనం ఏమీ ఇవ్వలేదన్నారు. పదవులు వచ్చినప్పుడు.. రానప్పుడు బాధలున్నా.. దేశం కోసం మనం పని చేయాలని కార్యకర్తలకు సోమ వీర్రాజు పిలుపు నిచ్చారు. ఇక దక్షిణ భారతదేశంలో మనం ఎక్కడా బలహీనంగా లేమని చెప్పారు. భవిష్యత్తులో తెలంగాణ, తమిళనాడులో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్సీ సోము వీర్రాజు జోస్యం చెప్పారు. ఈ అభినందన కార్యక్రమానికి కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రి కందుల దుర్గేష్‌తోపాటు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు.
రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ మిత్ర ధర్మం పాటించింది. అందులోభాగంగా రెండు స్థానాల్లో ఒకటి బీజేపీకి, మరొకటి జనసేనకు కేటాయించింది. జనసేన నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు ఎన్నిక కాగా.. మరో స్థానం నుంచి బీజేపీ తరఫున సోము వీర్రాజు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో సోము వీర్రాజుకు బీజేపీ శ్రేణులు అభినందన సభ ఏర్పాటు చేశారు.
మరోవైపు.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ దాని మిత్రపక్షమైన బీజేపీతో కలిసి విజయం సాధించింది. అనంతరం ఎమ్మెల్సీ గా తొలిసారి సోము వీర్రాజు గెలుపొంది. శాసనమండలిలో అడుగు పెట్టిన విషయం విధితమే. అయితే ఇటీవల ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలుత ఉత్తరాంధ్రకు చెందిన పీవీఎన్ మాధవ్ పేరు తెరపైకి వచ్చింది. కానీ చివరి నిమిషంలో సోము వీర్రాజును ఆ పదవి వరించింది. అదీకాక.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురందేశ్వరి రాజమండ్రి లోక్ సభ స్థానం నుంచి గెలుపొందారు. ఈ నేపథ్యంలో అదే నగరానికి చెందిన సోము వీర్రాజకు ఈ పదవి చేపట్టారనే ఓ చర్చ సైతం పార్టీలో సాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Dilshuknagar Bomb Blast: దోషుల తరఫున వాదించింది ఎవరంటే..
Chandrababu: చంద్రబాబుకు సొంత ఇల్లు..
Jaipur Bomb Blast Case: జైపూర్ బాంబు పేలుళ్ల కేసు: దోషులకు జీవిత ఖైదు
For Andhrapradesh News And Telugu News