Share News

నరసన్న కొండకు త్వరలో రోప్‌వే!

ABN , Publish Date - Apr 15 , 2025 | 01:41 AM

చారిత్రాత్మక కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఎతైన కొండపైకి భక్తులు వెళ్లేందుకు రోప్‌వే ఏర్పాటుచేయాలన్న ఎన్నో ఏళ్ల ప్రతిపాదనకు ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది.

నరసన్న కొండకు త్వరలో రోప్‌వే!

కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌.. ఫలించిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కృషి

కోరుకొండ, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): చారిత్రాత్మక కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఎతైన కొండపైకి భక్తులు వెళ్లేందుకు రోప్‌వే ఏర్పాటుచేయాలన్న ఎన్నో ఏళ్ల ప్రతిపాదనకు ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చేసిన ప్రయత్నాలు ఫలించడంతో ఈ ప్రాజెక్టుకు మోక్షం లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో 5 పర్యాటక ప్రాంతాల్లో రోప్‌వేలు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా సమాచారం అందిం ది. ఆంధ్రప్రదేశ్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ఏపీ పర్యాటక రంగం అభివృద్ధికి ఊతమిచ్చేలా కీలక అడుగుపడింది. ఆంధ్రప్రదేశ్‌లో ఐదుచోట్ల రోప్‌వే ప్రాజెక్టుల నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగం గా సమగ్ర ప్రాజెక్టుల తయారీ నివేదికలో కన ్సల్టెన్సీ సర్వీసుల కోసం టెండర్లు ఆహ్వానించారు. ఈమేరకు నేషనల్‌ హైవే ఆంధ్ర ప్రదేశ్‌లో రోప్‌వే ప్రాజెక్టుల తయారీకి డీపీఆర్‌ తయారీ కోసం టెండర్లును ఆహ్వానించింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 5 రోప్‌వేల్లో ఒకటి చిత్తూరు జిల్లాలోని బోయికొండపై గంగమ్మ ఆలయం, కర్నూలు జిల్లాలోని అహోబిలం దేవస్థానం, పల్నాడు లోని కోటప్పకొండ, విజయవాడలోని భవానీ ద్వీపం, తూర్పుగోదావరిలోని కోరుకొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండకు అను మతి లభించింది. ప్రధానంగా రుకొండ లక్ష్మీనరసింహస్వామి కొండకు 0.25 కిలోమీటర్ల మేర రోప్‌వేను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని 25 పర్యాటక ప్రాంతాల్లో రోప్‌వేల నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్‌ ప్రణాళికలను రూపొందిస్తోంది.దీనివల్ల రాష్ట్రంలోని పర్యాటకులతోపాటు ఇతర రాష్ట్రాల్లోని పర్యా టకులను ఆకర్షించేలా ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేస్తారు.

Updated Date - Apr 15 , 2025 | 01:41 AM