మరో రూ.5కోట్లు
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:52 AM
కాకినాడ పార్లమెంటు పరిధిలో అభివృద్ధి పను లు చేసేందుకు ఎంపీ లాడ్స్ రెండో విడత నిధు లు విడుదలయ్యాయి. గతేడాది తొలి విడతగా రూ.5కోట్లు నిధులు విడుదల చేశారు. తాజాగా ఇప్పుడు రెండో విడత మరో రూ.5కోట్లు నిధు లు విడుదల చేశారు.

రెండో విడత ఎంపీ లాడ్స్ నిధులు విడుదల
అభివృద్ధి పనులకు మొత్తంగా రూ.10కోట్లు సిద్ధం
కలెక్టరేట్(కాకినాడ), ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): కాకినాడ పార్లమెంటు పరిధిలో అభివృద్ధి పను లు చేసేందుకు ఎంపీ లాడ్స్ రెండో విడత నిధు లు విడుదలయ్యాయి. గతేడాది తొలి విడతగా రూ.5కోట్లు నిధులు విడుదల చేశారు. తాజాగా ఇప్పుడు రెండో విడత మరో రూ.5కోట్లు నిధు లు విడుదల చేశారు. మొత్తంగా రూ.10కోట్లు నిధులు అభివృద్ధి పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాకినాడ పార్లమెంటు పరిధిలో కాకి నాడ అర్బన్, కాకినాడ రూరల్, పిఠాపురం, ప్రత్తిపాడు, తుని, జగ్గంపేట, పెద్దాపురం అసెం బ్లీ నియోజకవర్గాలు ఏడు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో ఈ నిధులతో రోడ్లు, డ్రైన్లు, విద్యుత్‌సరఫరా, ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, పాఠశాల, కమ్యూనిటీ భవనాల నిర్మాణాలు చే యవచ్చు. గతేడాది విడుదలైన నిధులను ఏ పనులకు కేటాయించలేదు. ఈ నేపథ్యంలో కొంత వరకు జాప్యం జరిగింది. తాజాగా మరో రూ.5కోట్లు నిధులు విడుదల అవ్వడంతో అధి కార యంత్రాంగంలో కదలిక వచ్చింది.
రూ.2.5కోట్లకు కేటాయింపులు
జిల్లాకు ఎంపీ లాడ్స్ నిధులు మొత్తంగా రూ.10కోట్లు సిద్ధంగా ఉండగా ఇప్పటివరకు రూ.2.5కోట్లు వివిధ అభివృద్ధి పనులకు కేటా యించారు. దీనిలో జగ్గంపేటలో ఏలేరు కెనాల్ పై రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి రూ.60లక్షలు కేటాయించారు. తొండంగి మండలం, పెద్దాపు రం, సామర్లకోట మున్సిపాల్టీల్లో రూ.కోటితో క మ్యూనిటీ భవనాల నిర్మాణాలకు నిధులు కేటా యించారు. యు.కొత్తపల్లి, పిఠాపురం, కరప మండలాల్లో పార్కుల అభివృద్ధి, సీసీ రోడ్లు నిర్మాణాలకు రూ.50లక్షల నిధులు కేటాయించా రు. కాకినాడ దుమ్ములపేటలో కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు రూ.30లక్షలు కేటాయించా రు. మిగిలిన రూ.7.5కోట్లకు అభివృద్ధి పనుల ని మిత్తం పనులకు అంచనాలురూపకల్పన చేస్తు న్నట్లు అధికారులు వెల్లడించారు. మరో వారం లో పనులు కార్యరూపం దాలుస్తాయన్నారు.
గత ప్రభుత్వంలో అరకొర పనులు
గత వైసీపీ ప్రభుత్వంలో ఎంపీ లాడ్స్ నిధు లతో పనులు అరకొరగా నిర్వహించారు. అప్ప టి కాకినాడ ఎంపీకి రూ.20కోట్లతో అభివృద్ధి పనులు నిర్వహించే అవకాశం లభించింది. కానీ, ఆశించినస్థాయిలో పనులు నిర్వహించలే కపోయారు. రూ.20కోట్లతో 361 పనులకు ప్రతి పాదించారు. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి రూ.10కోట్లతో కేవలం 156 పనులను మాత్రమే పూర్తిచేశారు. ఇంకా రూ.10కోట్లతో 165 పనుల ను పెండింగ్‌లోనే ఉంచేశారు.