Share News

తూర్పున.. హై బీపీ!

ABN , Publish Date - Apr 08 , 2025 | 12:24 AM

ప్రభుత్వం ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ సాధనలో ఓ అడుగు ముందుకు వేసింది. ప్రజలు ఎం దుకు రోగాల బారిన పడుతున్నారు. ఎవరు ఏ కారణాల వల్ల ఇబ్బందులు పడుతున్నారనే హేతువును తేల్చింది.

తూర్పున.. హై బీపీ!

ఎన్‌సీడీ సర్వేలో రోగాలు

సుగర్‌ కేసులు 57790

రాష్ట్రంలో నాలుగో స్థానం

గుండె వ్యాధిగ్రస్తులు అధికమే

ప్రబలుతున్న అంటువ్యాధులు

(రాజమహేంద్రవరం -ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వం ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ సాధనలో ఓ అడుగు ముందుకు వేసింది. ప్రజలు ఎం దుకు రోగాల బారిన పడుతున్నారు. ఎవరు ఏ కారణాల వల్ల ఇబ్బందులు పడుతున్నారనే హేతువును తేల్చింది. రాష్ట్రవ్యాప్తంగా జరుగు తున్న వ్యాధుల స్ర్కీనింగ్‌లో భాగంగా జిల్లా లో కూడా గతేడాది నుంచి సర్వే చేస్తున్నారు. జిల్లాలో ఎన్‌సీడీ (నాన్‌ కమ్యూనికేబుల్‌ డిసీ జ్‌) 2,3 సర్వే జరిగింది. అందులో అనేక వ్యాఽ దులు బయటపడ్డాయి. ఎక్కువ మంది గుండె, కిడ్నీ, శ్వాస సంబంఽధిత వ్యాధులు, డయా బెటీస్‌, క్యాన్సర్‌, బీపీ వంటి సమస్యలతో అధికంగా ఇబ్బంది పడుతున్నట్టు తేలింది. సర్వేలో సుమారు 10 రకాల వ్యాధుల గురిం చి ఆరా తీశారు. 18 ఏళ్ల వయసు తర్వాత మహిళలు ఎక్కువ మంది హైపర్‌ టెన్షన్‌కు గురవుతున్నట్టు తెలిసింది. డయాబెటీస్‌ మగ వారిలో ఎక్కువగా కనిపిస్తోంది. వర్షాకాలంలో వ్యాపించే చికున్‌ గున్యా, డెంగీ, మలేరియా వంటి వ్యాధులు జిల్లాలో అధికంగా ఉన్నట్టు చెబుతున్నారు. జిల్లాలో ఎన్‌సీడీ -2,3 సర్వేల్లో తేలిన అంశాల వివరాలిలా ఉన్నాయి. 88,784 మందికి హైపర్‌ టెన్షన్‌ ఉంది. డయా బెటీస్‌ (చక్కెర వ్యాధి)తో 57,790 మంది బాధపడుతున్నారు. రాష్ట్రంలో డయాబెటీస్‌ విషయంలో జిల్లా 4వ స్థానంలో ఉంది. హైప ర్‌ టెన్షన్‌, డయాబెటీస్‌ ఉన్నవారి సంఖ్య 1,07,482గా ఉంది. ఇక మాయమైపోయింద నుకున్న పొంగు, ఆట్లమ్మ (చికున్‌ఫాక్స్‌) వంటి అంటువ్యాధులు ఇటీవల ఎక్కువగా కనిపిస్తు న్నాయి. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతా లతో పాటు, ఉమ్మడి జిల్లాలో కూడా కేసులు నమోదు కావడం గమనార్హం. సర్వేలో తేలిన వ్యాధులకు చాలా మంది ఎన్టీఆర్‌ వైద్య సేవ ద్వారా చికిత్స పొందున్నారు. ఇప్పటి వరకూ జిల్లాలో గుండె వ్యాధులకు సంబంధించి 8,891 మంది చికిత్స పొందారు.క్యాన్సర్‌కు సంబం ధించి 5,106 మంది చికిత్స పొందారు. లివర్‌ సంబంధిత వ్యాధుల విషయంలో 1,084మంది చికిత్స పొందారు. ఽధీర్ఘకాలిక, శ్వాసకోశ వ్యాధు లకు 1015 మంది చికిత్స తీసుకున్నారు. న్యూరాజికల్‌ ఇష్యూస్‌కు సంబంధించి 4,027 మంది చికిత్స పొందారు.క్రానిక్‌ కిడ్నీ వ్యాధు లకు సంబంధించిన 4993 మంది చికిత్స పొం దారు. దీర్ఘకాలిక రోగాలకు ఆహారపు అల వాట్లు, ప్రజల జీవన విధానంలో మార్పు వంటి కారణాలే ఎక్కు వగా కనిపిస్తున్నాయి.

Updated Date - Apr 08 , 2025 | 12:24 AM