Share News

బ్యారేజీ వద్ద పర్యవేక్షణ లోపం

ABN , Publish Date - Apr 15 , 2025 | 01:39 AM

బ్యారేజీ వద్ద అధికారుల పర్యవేక్షణ లేక పోవడంతో నిషేధిత స్థలాల్లో స్నానాలకు వెళ్లి అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతీ ఏటా విషాద ఘటనలు జరుగుతున్నా ఎవ రూ పట్టించుకోవడంలేదు.

బ్యారేజీ వద్ద పర్యవేక్షణ లోపం
మద్దూరులంక ప్రాంతంలో గాలింపు చర్యలు

అడ్డగట్ల వద్ద వేలాది మంది స్నానాలు.. ప్రాణాలు కోల్పోతున్న యువకులు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

బ్యారేజీ వద్ద అధికారుల పర్యవేక్షణ లేక పోవడంతో నిషేధిత స్థలాల్లో స్నానాలకు వెళ్లి అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతీ ఏటా విషాద ఘటనలు జరుగుతున్నా ఎవ రూ పట్టించుకోవడంలేదు. వేసవి కావడంతో సరదా కోసం అనేక మంది బ్యారేజీ దిగువ ప్రాంతంలోనూ, లాకుల వద్ద స్నానాలు చేస్తు న్నారు. ఏకంగా మోటారు సైకిళ్ల వంటి వాహనాలను కూడా తీసుకెళ్లి ఫీట్లు చేస్తున్నా రు. యువతతోపాటు మహిళలు, పెద్దలు, చిన్నపిల్లలు కూడా ఇక్కడ స్నానాలకు ఎగ బడడం గమనార్హం. నిజానికి ఇవన్నీ నిషేధి త ప్రాంతాలు. ఇక్కడెవరూ స్నానం కూడా చేయకూడదు. కానీ అధికారులు పట్టించుకో కపోవడం వల్ల ఎండాకాలంలో ఇక్కడ జనం జలకాలాటలు ఎక్కువ అవుతున్నాయి. ధవళే శ్వరం నుంచి విజ్జేశ్వరం వరకూ గోదావరి కాటన్‌ బ్యారేజీకి 175 గేట్లు ఉన్నాయి. వీటి దిగువ కొంత నీరు ఉంటుంది. ఊట నీరు కూడా ప్రవహిస్తూ ఉంటుంది. గేట్ల వద్ద అఖండ గోదావరి వైపు ఎక్కువ నీరు ఉం టుంది. ఇది ప్రమాదకరమైన ప్రాంతం. అక్క డ కొందరు దూకి సాహసాలు చేస్తుంటారు. ఇక్కడ ఎక్కడ ఊబి ఉందో, ఎక్కడ గొయ్య ఉందో తెలియదు. దీంతో నూరేళ్లు బతకవల సిన పిల్లలు వాటిలో పడి అకాల మృత్యువు కు గురవుతున్నారు. వారి కన్నవారికి శోకం మిగులుతోంది. ఇప్పటికైనా అధికారులు పర్య వేక్షణ పెంచే చర్యలు తీసుకోవాలి.

Updated Date - Apr 15 , 2025 | 01:39 AM