టీడీపీ ఆవిర్భావం చారిత్రకం
ABN , Publish Date - Mar 30 , 2025 | 12:50 AM
తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చారిత్రకమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం స్థానిక తిలక్‌రోడ్డులోని పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా జరిగింది.

ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు
ఘనంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం
ఎన్టీఆర్‌కు తెలుగు తమ్ముళ్ల నివాళి
పార్టీ పతాకాల ఆవిష్కణ
పలుచోట్ల సేవా కార్యక్రమాలు
రాజమహేంద్రవరం సిటీ, మార్చి 29(ఆంధ్ర జ్యోతి): తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చారిత్రకమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం స్థానిక తిలక్‌రోడ్డులోని పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా జరిగింది. దీనికి వాసుతోపాటు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డిఅప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌కుమార్, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావులతో కలిసి హాజరయ్యారు. పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం తెలుగు నాట అతిపెద్ద సామాజిక విప్లవానికి నాంది పలికిందన్నారు. అప్పటి వరకు కేవలం నాలుగు గోడల మధ్య పరిమితమైన రాజకీయం టీడీపీ ఆవిర్భావంతో సామాన్యుని ముంగిటకు చేరిందన్నారు. రూ.2కే కిలో బియ్యం పథకం అప్పట్లో ఒక చరిత్ర సృష్టించిందన్నారు. ఎన్‌టిఆర్ తర్వాత పార్టీ సారధ్య భాద్యతలు స్వీకరించిన చంద్రబాబు పార్టీని మరో స్థాయికి తీసుకెళ్లారన్నారు. అలాగే స్థానిక శ్రీరాంనగర్‌లో జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ విగ్రహానికి గన్ని కృష్ణ, టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యర్రా వేణుగోపాలరాయుడు, కాశి నవీన్‌లతో కలిసి నివాళులర్పించారు. అలాగే చలివేంద్రాన్ని గన్ని కృష్ణ ప్రారంభించారు.
జేఎన్ రోడ్డులో ఎన్టీఆర్ పార్కు..
స్థానిక జేఎన్ రోడ్డులోని ఏకేసీ కళాశాల పక్కనే ఉన్న పార్కుకు ఎన్టీఆర్ పార్కుగా నామకరణం చేసి ఆ పార్కును, అందులో సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాలను ఎమ్మెల్యే వాసు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2015లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఈ పార్కుకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని తీర్మానించామన్నారు. అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ పార్కుకు పేరుపెట్టకుండా హ్యాపీ స్ట్రీట్‌గా ఏర్పాటు చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పార్కుకు ఆయన పేరు పెట్టామన్నారు. విగ్రహాన్ని తయారు చేసిన వడయార్‌ను సత్కరించారు. కార్యక్రమాల్లో కుడుపూడి సత్తిబాబు వర్రే శ్రీనివాసరావు, బుడ్డిగ రాధ, మజ్జి రాంబాబు, నక్కా చిట్టిబాబు, దాస్యం ప్రసాద్, రాచపల్లి ప్రసాద్, బుడ్డిగ రవి, మళ్ల వెంకట్రాజు, ఆడారి లక్ష్మినారాయణ, మాలే విజయలక్ష్మి, కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి, తురకల నిర్మల, మీసాల నాగమణి, తుల్లి పద్మ, మోతా నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.