Share News

‘నిడదవోలు’ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

ABN , Publish Date - Apr 13 , 2025 | 01:18 AM

రాష్ట్రం లో నిడదవోలు నియోజకవర్గాన్ని అన్ని రంగా ల్లోనూ అభివృద్ధి పథంలో నిలిపేందుకు కృషి చేస్తానని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్‌ పేర్కొ న్నారు. శనివారం ఆయన మున్సిపల్‌ కార్యాల యంలో జనసేనలో చేరిన కౌన్సిలర్లతో సమా వేశం నిర్వహించారు.

‘నిడదవోలు’ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
దొడ్డిగుంట గ్రామంలో ముత్యాలమ్మకు నగలు, వెండి కిరీటం తీసుకొస్తున్న మంత్రి దుర్గేష్‌

  • పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్‌

నిడదవోలు, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం లో నిడదవోలు నియోజకవర్గాన్ని అన్ని రంగా ల్లోనూ అభివృద్ధి పథంలో నిలిపేందుకు కృషి చేస్తానని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్‌ పేర్కొ న్నారు. శనివారం ఆయన మున్సిపల్‌ కార్యాల యంలో జనసేనలో చేరిన కౌన్సిలర్లతో సమా వేశం నిర్వహించారు. వైసీపీ ప్రవే శపెట్టనున్న చైర్మన్‌పై అవిశ్వాసా నికి కూడా అవకాశం లేకుండా కౌన్సిల్‌ జనసేన వశం కావడంపై హర్షం వ్యక్తంచేస్తూ కేక్‌ కట్‌ చేశా రు. ఈ కార్య క్రమంలో పాల్గొన్న మంత్రి దుర్గేష్‌ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ నేతృ త్వంలో అందరి ఆదరాభిమానాలను పొందుతూ జనసేన బలోపేతం అవుతోందన్నారు. నిడదవోలు అభివృద్ధిలో భాగ స్వాములు కావడానికి వైసీపీకి చెందిన 13 మంది కౌన్సిలర్లు జనసేనలో చేరడం అభినంద నీయమన్నారు. నిడదవోలు పట్టణాన్ని రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తానన్నారు. కార్య క్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ భూపతి ఆదినారా యణ, వైస్‌ చైర్‌పర్సన్‌ గంగుల వెంకటలక్ష్మి, పువ్వల రతీదేవి, చిలకల శారదాదేవి తదితరులు పాల్గొన్నారు.

  • ముత్యాలమ్మను దర్శించుకున్న మంత్రి

రంగంపేట, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): మండలంలోని దొడ్డిగుంట గ్రామంలో శనివారం శ్రీ ముత్యాలమ్మ జాతర ఘనంగా జరిగింది. మం త్రి కందుల దుర్గేష్‌.. అమ్మవారికి అలంకరించేందుకు నగలు, వెండి కిరీటం తీసుకొచ్చారు.అమ్మ వారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో అడ బాల మణికంఠ, బీజేపీ మండలాధ్యక్షుడు ఎం. సాయిరామ్‌, కొండేపూడి నాని, జనసేన నాయకులు సత్తిబాబు, యానాల కొండ, టీడీపీ నాయకుడు యలమాటి సుధాకర్‌, సర్పంచ్‌ అడబాల మరిడియ్యకాపు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2025 | 01:18 AM