Share News

వాడపల్లి ఉత్సవాలను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Apr 08 , 2025 | 01:06 AM

వాడపల్లి వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలను పోలీస్‌ యంత్రాంగం విజయవంతంగా చేపట్టాలని డీఎస్పీ సుంకర మురళీమోహన్‌ సూచించారు.

వాడపల్లి ఉత్సవాలను విజయవంతం చేయాలి

ఆత్రేయపురం, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలను పోలీస్‌ యంత్రాంగం విజయవంతంగా చేపట్టాలని డీఎస్పీ సుంకర మురళీమోహన్‌ సూచించారు. సోమవారం రాత్రి మహాలక్ష్మిరాజు కన్వెన్షన్‌ హాలులో పోలీస్‌ సిబ్బంది తో ఆయన సమీక్షించారు. ఉత్సవాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బాధ్యతగా పనిచేయాలన్నారు. ఐదు సెక్టార్లుగా విభజించి పోలీస్‌ సిబ్బందికి డ్యూటీలు వేశామన్నారు. కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి నిఘా నీడలో సిబ్బంది విధులు నిర్వహిస్తారన్నారు. సమావే శంలో సీఐ విద్యాసాగర్‌, ఎస్‌ఐ రాము, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2025 | 01:06 AM