మహిళోద్ధరణకు ఫూలే కృషి
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:26 AM
అంటరానితనం, కలవ్యవస్ధ నిర్మూలనతో బాటు మహిళోద్ధరణకు జ్యోతిరావు ఫూలే చేసిన కృషి ఎంతో గొప్పదని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్ అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని శుక్రవారం పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నన్నయ వర్శిటీలో ఫూలే చిత్రపటానికి రిజిస్ట్రార్ పూలమాల వేసి అంజలి ఘటించారు.

నన్నయ రిజిస్ట్రార్ సుధాకర్
మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి
పలువురు నాయకుల నివాళి
దివాన్‌చెరువు, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి) :అంటరానితనం, కలవ్యవస్ధ నిర్మూలనతో బాటు మహిళోద్ధరణకు జ్యోతిరావు ఫూలే చేసిన కృషి ఎంతో గొప్పదని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్ అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని శుక్రవారం పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నన్నయ వర్శిటీలో ఫూలే చిత్రపటానికి రిజిస్ట్రార్ పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందడానికి సత్యశోధక్ సమాజ్‌ను ఏర్పాటు చేశారన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి పని చేశారని చెప్పారు. వ్యక్తిగత జీవితాలను సమాజం కోసం త్యాగం చేసి నలుగురికి ఉపయోగపడే విధంగా మంచి పనులు చేసిన ప్రతీఒక్కరూ మహనీయులుగా కీర్తింపబడతారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ ఎన్.ఉదయభాస్కర్, పి.విజయనిర్మల, పి.వెంకటేశ్వరరావు, కె.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.