AP Government: అమరావతి అభివృద్ధిలో మరో కీలక ఘట్టం.. మంత్రి నారాయణ ప్రకటన
ABN , Publish Date - Apr 15 , 2025 | 09:48 AM
Narayana: గత జగన్ ప్రభుత్వం రాజధానిన అమరావతిని నిర్లక్ష్యం చేసిందని మంత్రి నారాయణ ఆరోపించారు. మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యాక అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. . రైతులకు తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ వెల్లడించారు.

అమరావతి: రాజధాని గ్రామం అనంతవరంలో మంత్రి నారాయణ ఇవాళ(మంగళవారం) పర్యటించారు. రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన గ్రావెల్ లభ్యత, మైనింగ్‌ను పరిశీలించారు. రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండో విడత భూ సమీకరణ అంశంపై రైతుల్లోనూ మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ... 2014-19లో ఇచ్చిన టెండర్లకు గత జగన్ ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని అన్నారు. చాలా లీగల్ హర్డిల్స్ లేకుండా చేయడానికి 8 నెలలు పట్టిందని మంత్రి నారాయణ చెప్పారు.
మొత్తం 93 పనులు మిగిలిపోయాయని.. వీటిలో రూ. 41,700 కోట్లకు టెండర్లు ఇచ్చామని మంత్రి నారాయణ గుర్తుచేశారు. గ్రావెల్ కోసం చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్న మైన్స్‌ను కేటాయించారని తెలిపారు. అనంతవరంలో ఉన్న మైన్స్ సీఆర్డీఏకు ఇచ్చారని అన్నారు. ఇక్కడ 6, 8 మీటర్ల చొప్పున తవ్వేశారని చెప్పారు. ఈ విషయంపై డ్రోన్‌తో సర్వే చేయించి ఈ ప్రాంతాన్ని వాడుకోవడానికి చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాబోయే వంద సంవత్సరాల గురించి ఆలోచిస్తారని చెప్పారు. ఫ్యూచర్‌లో ఒక మెగా సిటీగా ఈ ప్రాంతం డెవలప్‌మెంట్ కావడానికి భూములు తీసుకోవడం వల్ల రైతులు నష్టపోతారని మంత్రి నారాయణ అన్నారు.
ఎయిర్‌పోర్ట్‌కు 5000 ఎకరాలు కావాలంటే 30, 40 వేల ఎకరాలను రైతుల వద్ద తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి నారాయణ తెలిపారు. ముందు తీసుకున్న వర్క్స్‌కు టెండర్లు అయిపోయాయన్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాజధాని ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీగా ఉంటే ఉద్యోగాలు పెరుగుతాయని వెల్లడించారు. అమరావతి కోసం రైతులు 34 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తుచేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో అసెంబ్లీ, హై కోర్ట్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ డిజైన్ పనులు కూడా జరిగాయని.. కానీ గత జగన్ ప్రభుత్వం రాజధానిని పట్టించుకోలేదని చెప్పారు. మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యాక రాజధాని అమరావతి కోసం రీ టెండర్లను పిలిచామని ప్రకటించారు. రాజధానిలో రూ.64 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని తెలిపారు. రాజధానికి గ్రావెల్ కావాలని... మైన్స్ సీఆర్డీఏకు 851 ఎకరాలను ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు. రోడ్ల నిర్మాణం కోసం గ్రావెల్ మెటల్ కావాలని అన్నారు. మైన్స్ శాఖ సంబంధిత అధికారులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుందన్నారు. గతంలో ఇక్కడ మైన్స్ తవ్వడం వల్ల ఇబ్బందులు వచ్చాయని మంత్రి నారాయణ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
AP Cabinet meeting: ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
CM Chandrababu Naidu: మళ్లీ అంబేడ్కర్ విదేశీ విద్య
Vontimitta Accident: అతి వేగం ఖరీదు మూడు ప్రాణాలు
Intermediate Results: ఇంటర్‌లో ‘ప్రభుత్వ’ టాపర్లకు నేడు సన్మానం
Read Latest AP News And Telugu News