Share News

AP GOVT: పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం ఫోకస్.. ముంబైలో కీలక సమావేశం

ABN , Publish Date - Apr 08 , 2025 | 10:44 AM

Kandula Durgesh: పర్యాటక రంగంలో ఉపాధి, పెట్టుబడులే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ ఉద్ఘాటించారు. ఇందుకోసం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

AP GOVT:  పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం ఫోకస్.. ముంబైలో కీలక సమావేశం
Kandula Durgesh

అమరావతి: పర్యాటక పెట్టుబడులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వడివడిగా చర్యలు తీసుకుంటుంది. పెట్టుబడుల కోసం ఏప్రిల్ 9,10 తేదీల్లో ముంబైలో మంత్రి కందుల దుర్గేష్ పర్యటించనున్నారు. ముంబై పోవై లేక్‌లో 8 నుంచి 10వ తేదీ వరకు జరుగుతున్న దక్షిణాసియా 20వ హోటల్ ఇన్వెస్ట్‌మెంట్ కాన్ఫరెన్స్ వర్క్ షాప్‌లో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొననున్నారు. ఆతిథ్య రంగంలో పెట్టుబడుల అవకాశాలను వివరించి ఇన్వెస్టర్లను ఏపీకి మంత్రి దుర్గేష్ ఆహ్వానించనున్నారు.


ఇన్వెస్టర్లకు మెరుగైన రాయితీలు కల్పించి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి కందుల దుర్గేష్ భరోసా కల్పించనున్నారు. మంత్రి దుర్గేష్‌తో పాటు పర్యటనలో పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్ జైన్, టూరిజం ఎండీ ఆమ్రపాలి కాట ఉన్నారు. నూతన పర్యాటక పాలసీ, పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా తదితర వివరాలను మంత్రి బృందం వెల్లడించనున్నారు. పర్యాటక రంగంలో ఉపాధి, పెట్టుబడులే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ ఉద్ఘాటించారు. పర్యాటక రంగంలో రూ. 25 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పర్యాటక రంగంలో రూ.1200 కోట్లకు పైగా పెట్టుబడులు, 8 ఎంవోయూలు చేసుకున్నామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కుమారుడికి ప్రమాదం.. ఏమైందంటే..

Train Accident: రెండు భాగాలుగా విడిపోయిన రైలు...సీన్ కట్ చేస్తే ఇదీ పరిస్థితి

ఆరోగ్యాంధ్రే లక్ష్యం

హెచ్‌సీయూ విద్యార్థులపై కేసుల ఎత్తివేత

For More AP News and Telugu News

Updated Date - Apr 08 , 2025 | 10:50 AM