AP GOVT: సంక్రాంతి వేళ ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఏంటంటే..
ABN, Publish Date - Jan 13 , 2025 | 11:59 AM
AP Govt Employees: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను ఏపీ ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. జగన్ ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని అడిగితే పట్టించుకోలేదని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ తెలిపారు.
అమరావతి: సంక్రాంతి పర్వదినం వేళ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ ఓ ప్రకటన విడుదల చేశారు. పోలీసుల సరెండర్ లీవ్, ఉద్యోగుల జీపీఎఫ్, మెడికల్ రీయింబర్స్‌మెంట్, FTA బిల్లులు అకౌంట్స్‌లో జమకానున్నాయి. సర్వీస్ పోస్టేజ్, ఇంటర్నెట్ చార్జీలు, అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు, స్టేషనరీ, మైనర్ రిపేర్స్ బిల్లులను కూడా ప్రభుత్వం విడుదల చేయనుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో దీర్ఘకాలంగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. బకాయిల విడుదలతో సుమారు రూ. 2 వేల కోట్లు ఉద్యోగుల అకౌంట్స్‌లో జమకానున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో స్టేషనరీ చార్జీలు ఇవ్వకపోవడంతో వాటిని వ్యక్తిగతంగా ఉద్యోగులు బరించారు. ఈ రోజు సాయంత్రానికి మొత్తం బిల్లులు జమకానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, అధికారులకు విద్యాసాగర్ కృతజ్ఞతలు తెలిపారు. బకాయిల విడుదలతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Jan 13 , 2025 | 01:25 PM