CM Chandrababu: మెట్రో ప్రాజెక్ట్‌పై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు
ABN, Publish Date - Jan 02 , 2025 | 09:17 PM
CM Chandrababu: ఏపీలో చేపట్టనున్న మెట్రో ప్రాజెక్ట్‌పై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖపట్నంలో మొదటి స్టేజ్‌లో చేపట్టే మధురవాడ నుంచి తాడిచెట్లపాలెం వరకు 15 కి.మీ, గాజువాక నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు 4 కి.మీ డబుల్ డెక్కర్ మోడల్లో మెట్రో నిర్మించనున్నారు. అలాగే విజయవాడలో రామవరప్పాడురింగ్ నుంచి నిడమానూరు వరకు 4.7 కి.మీ డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు.
అమరావతి: విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ(గురువారం) ఏపీ నచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2017 మెట్రో పాలసీ అధారంగా ఫండింగ్ మోడల్స్‌పై చర్చించారు. రెండు నగరాల్లో డబుల్ డెక్కర్ విధానంలో 25 కి.మీ మేర మెట్రో నిర్మాణంపై చర్చించారు.విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా 66 కి.మీ మేర విజయవాడ మెట్రో, 76.90 కి.మీ మేర విశాఖ మెట్రో ప్రాజెక్టులు చేపట్టేందుకు ఇప్పటికే డీపీఆర్‌లు ఆమోదం పొందాయి. ఈ ప్రాజెక్టులకు నిధుల అంశంపై గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు.మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి ప్రజెంటేషన్ ద్వారా మెట్రో ప్రాజెక్టు స్థితిగతులపై ప్రదర్శన ఇచ్చారు. 2017లో వచ్చిన కొత్త మెట్రో పాలసీ ప్రకారం ఏపీలో చేపట్టే ప్రాజెక్టులకు ఫండింగ్ మోడల్స్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. 2017 వరకు వందశాతం నిధులు కేంద్ర ప్రభుత్వం భరించే విధానం లేదని... అయితే 2017 పాలసీ ప్రకారం వందశాతం ఈక్విటీ కేంద్రమే చెల్లిస్తూ కోల్‌కత్తాలో 16 కి.మీ మేర ప్రాజెక్టు చేపట్టారు.
రూ.8,565 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, రైల్వే శాఖలు కోల్ కత్తా ప్రాజెక్టును చేపట్టాయని చెప్పారు. ఇదే తరహాలో ఏపీలో కూడా మెట్రో పాజెక్టులు చేపట్టే అంశంపై కేంద్రంతో చర్చించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కూడా రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టు ఉందని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. ఆ చట్ట ప్రకారమైనా...లేకపోతే 2017 మెట్రో పాలసీ ద్వారానైనా కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలని సీఎం చంద్రబాబు కోరారు. ఈ మేరకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.రెండు చోట్లా డబుల్ డెక్కర్ ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం, విజయవాడలలో చేపట్టే మెట్రో ప్రాజెక్టుల్లో డబుల్ డెక్కర్ విధానం అమలు చేసేలా నిర్ణయం తీసుకున్నారు.హైవే ఉన్న చోట్ల డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఈ విధానంలో కింద రోడ్డు దానిపైన ఫ్లైవోవర్ ఆపైన మెట్రో వస్తుందని చెప్పారు.
విశాఖపట్నంలో మొదటి స్టేజ్‌లో చేపట్టే మధురవాడ నుంచి తాడిచెట్లపాలెం వరకు 15 కి.మీ, గాజువాక నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు 4 కి.మీ డబుల్ డెక్కర్ మోడల్లో మెట్రో నిర్మించనున్నారు. అలాగే విజయవాడలో రామవరప్పాడురింగ్ నుంచి నిడమానూరు వరకు 4.7 కి.మీ డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే ఈ తరహా మోడళ్లు పలు నగరాల్లో అందుబాటులో ఉన్నాయని అన్నారు. కాబట్టి మన రాష్ట్రంలోనూ ఈ తరహా నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంతో త్వరితగతిన సంప్రదింపులు పూర్తి చేసి మెట్రో పనులు ప్రారంభమయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. నాలుగేళ్లలో రెండు నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చేలా లక్ష్యాన్ని నిర్ధేశించుకుని పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నేరాల నియంత్రణే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గంజాయి, డ్రగ్స్ సరఫరా చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు కఠినంగా ఉండాలని ఆదేశించారు. ప్రొబెషనరీ ఏఎస్పీలు, డీఎస్పీలతో సీఎం చంద్రబాబు పలు కీలక విషయాలపై చర్చించారు.ఈ సమీక్షలో మంత్రులు నారాయణ, బీసీ జనార్థన్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: రెవెన్యూ అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. కారణమిదే..
AP News: ఏపీ క్యాబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు..
AP Politics: టీడీపీ వర్సెస్ వైసీపీగా మండల సర్వసభ్య సమావేశం.. మాటల యుద్ధానికి దిగిన ఇరువర్గాలు..
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ మీటింగ్... కీలక అంశాలకు ఆమోద ముద్ర
Read Latest AP News and Telugu News
Updated Date - Jan 02 , 2025 | 09:19 PM