Nara Lokesh: మంగళగిరిని అన్నివిధాలా అభివృద్ధి చేస్తా
ABN, Publish Date - Mar 14 , 2025 | 12:37 PM
Minister Nara Lokesh: మంగళగిరి అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు

మంగళగిరి: మంగళగిరికి మంత్రి నారా లోకేష్ హామీల వర్షం కురిపించారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. మంగళగిరి ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇక్కడి ప్రజల రుణం తీర్చుకోలేనిదని తెలిపారు. ప్రజలు తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించారని మంత్రి నారా లోకేష్ అన్నారు.
ఇవాళ(శుక్రవారం)మంగళగిరి నియోజకవర్గం, యర్రబాలెం ఇండస్ట్రీయల్ ఏరియాలో భగవాన్ మహావీర్ గోశాల సంస్థ ఆధ్వర్యంలో పునరుద్ధరించిన గోశాలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఏపీలో ఎప్పుడూ జరగని విధంగా మంగళగిరిని అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఈ ప్రాంతంలో జెమ్స్ అండ్ జ్యూయలరీ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తున్నానని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Pawan Kalyan: జనసేన పవర్ ముందు జగన్ డీలా.. నాడు అలా.. నేడు ఇలా
ABN Effect: వీఆర్‌కు సీఐ భుజంగరావు
For More AP News and Telugu News
Updated Date - Mar 14 , 2025 | 12:47 PM