Payyavula keshav: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన
ABN, Publish Date - Mar 30 , 2025 | 04:55 PM
Payyavula keshav: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపులపై ఈ సమావేశంలో చర్చించామని పయ్యావుల కేశవ్ అన్నారు.

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఇవాళ (ఆదివారం) ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ అయ్యారు. ఆర్థిక శాఖ అధికారులతో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు పయ్యావుల భేటీ కీలక ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపులపై కసరత్తు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు. బిల్లుల చెల్లింపుల్లో చిన్న కాంట్రాక్టర్లకు పెద్ద పీట వేస్తున్నామని అన్నారు. రూ. 2 వేల కోట్ల మేర ఏపీ ఆర్థిక శాఖ బిల్లుల చెల్లింపులు చేపట్టనుందని చెప్పారు. సుమారు 17 వేల మందికి ఏపీ ఆర్థిక శాఖ బిల్లులు చెల్లించనుందని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.
9 వేల మంది చిన్న కాంట్రాక్టర్లు, 8 వేల మంది నీరు-చెట్టు లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులు చేస్తున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. దీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న వివిధ బిల్లుల చెల్లింపులు చేస్తున్నామని అన్నారు. సాధ్యమైనంత మేరకు ఫిఫో పద్ధతిని పాటిస్తూ చెల్లింపులు జరపాలని మంత్రి పయ్యావుల కేశవ్ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. మొత్తం విడుదల చేస్తున్న బిల్లుల్లో రూ. 2000 కోట్లల్లో 90 శాతం చిన్న కాంట్రాక్టర్లకు.. కేవలం 10 శాతం మాత్రమే పెద్ద కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరపనున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.
రూ. కోటి లోపు ఉన్న బిల్లులే ప్రాధాన్యంగా చెల్లింపుల ప్రక్రియ జరుగుతోందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. నీరు-చెట్టు, పాట్ హోల్ ఫ్రీ రోడ్లు, నాబార్డు పనులకు బిల్లుల చెల్లింపులు చేస్తున్నామని ప్రకటించారు. ఇరిగేషన్ మెయింటనెన్స్ బిల్లులతో పాటు పోలవరం ప్రాజెక్టుకూ కొంత మొత్తం బిల్లులను విడుదల చేశామన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించాలన్న సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో పని చేస్తున్నామని తెలిపారు. ఎన్ని ఇబ్బందులున్నా పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నామని అన్నారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడడానికి బిల్లుల చెల్లింపులు దోహదపడతాయని చెప్పారు. మూడు, నాలుగేళ్ల నుంచి పెండింగులో ఉన్న బిల్లులను చెల్లిస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..
Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..
TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్
For More AP News and Telugu News
Updated Date - Mar 30 , 2025 | 05:01 PM