AP Project : మంత్రి లోకేష్ కృషితో ఏపీకి మరో భారీ పెట్టుబడి.. త్వరలో కార్యకలాపాలు
ABN, Publish Date - Feb 12 , 2025 | 01:37 PM
Nara Lokesh: మంత్రి నారా లోకేష్ కృషితో ఏపీలో మరో సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. నారా లోకేష్‌ను సిఫీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజు ఈరోజు కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా నారా లోకేష్ సిఫీ చైర్మన్‌ను అడిగారు. నారా లోకేష్ అడగడంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిఫీ చైర్మన్ సముఖత వ్యక్తం చేశారు.

అమరావతి: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసపీ ఘోర ఓటమి తర్వాత చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు దీరింది. దీంతో రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి దేశ, విదేశీ కంపెనీలు సైతం రాష్ట్రానికి క్యూ కట్టాయి. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇప్పటికే పలు కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి సీఎం చంద్రబాబుతో ఒప్పందాలు చేసుకున్నాయి. అలాగే జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీ నుంచి లూలు సంస్థ వెళ్లిపోయింది. ఆ సంస్థ సైతం మళ్లీ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి అంగీకారం తెలిపింది.
విశాఖలో పెట్టుబడులకు సిద్ధం..
ఇవేగాకుండా టాటా సంస్థతోపాటు పలు ప్రముఖ ఐటీ కంపెనీలు కూడా ఏపీలో తమ సంస్థలను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయి. అయితే తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్‌ను ఫార్చూన్ 500 కంపెనీ సిఫీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజు వేగేశ్న ఇవాళ(బుధవారం) కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి లోకేష్ ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి సిఫీ ఛైర్మెన్ రాజు వేగేశ్న సుముఖత వ్యక్తం చేశారు. విశాఖలో మెగా డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుపై నారా లోకేష్ చర్చించారు. ఏపీలో పెట్టుబడులకు ప్రస్తుత అవకాశాలను మంత్రి లోకేష్ వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న సేవలపై వివరణ ఇచ్చారు. నూతనంగా తీసుకువచ్చిన ఐటీ పాలసీల గురించి లోకేష్ ప్రస్తావించారు.
యువతకు ఉపాధి లేక అవస్థలు..
కాగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాకపోవడంతో ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకలేదు. దీంతో యువత చాలా నష్టపోయింది. గత జగన్ ప్రభుత్వ అనాలోచిత చర్యలతో లూలూ సంస్థ కూడా ఏపీ నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయింది. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు కాకపోవడంతో.. ఉపాధి కోసం యువత దేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గ్రహించారు. అందుకే.. ఈ ఏడాది మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమల ఏర్పాటుకు దేశవిదేశీ సంస్థలు క్యూ కడుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ లిక్కర్ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలి
ఏడాదైనా ఫైళ్లు క్లియర్ చేయరా?
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Feb 12 , 2025 | 01:58 PM